నందమూరి హీరో సినిమా రిలీజ్.. ఎవరు పట్టించుకోరే?

నందమూరి వారసుల లిస్ట్ పెద్దదే అయినా సినీ కెరీర్ లో నిలదొక్కుకుంది మాత్రం చాలా తక్కువ మంది.

ఇది అందరికి తెలిసిన విషయమే.జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వగానే మరో వారసుడు తారకరత్న కూడా స్పీడ్ గా ఎంట్రీ ఇచ్చాడు.

కెరీర్ మొదట్లో వారసగా 6 సినిమాలకు సైన్ చేసి అప్పట్లో ఒక రికార్డ్ సెట్ చేశాడు.

"""/"/ కానీ ఏ సినిమా కూడా ఈ యువ హీరో కెరీర్ కి ఉపయోగపడలేదు.

సినిమా సెట్స్ పైకి వస్తున్నా కూడా రిలీజ్ కావడం కష్టంగా మారింది.నందమూరి వారసుల్లో ఎలాంటి సినిమా రిలీజైనా వారి ఫ్యాన్స్ నుంచి ఒక ప్రత్యేకమైన జోరు కనిపిస్తుంటుంది.

కానీ ఇప్పుడు తారకరత్న నుంచి రిలీజ్ అవుతున్న సినిమాకు కనీసం రవ్వంత హవా కూడా కనిపించడం లేదు.

నేడు తారకరత్న నటించిన కాకతీయుడు సినిమా విడుదలయ్యింది.అయితే ఈ సినిమాను ఎవరు కూడా పట్టించుకోకకపోవడం చూస్తుంటే పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని అనిపిస్తోంది.

ఎందుకంటే 2015లోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్నాళ్లపాటు ఆర్థిక సమస్యలతో అటకెక్కింది.

అప్పట్లో దాసరి నారాయణరావు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.సినిమాకు ఏ మాత్రం ప్రమోషన్స్ లేకుండా కొన్ని థియేటర్స్ లో నేడు సినిమాను రిలీజ్ చేశారు.

మరి సినిమా ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో నిర్మాతలకె తెలియాలి.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?