ఆర్టీసీ బిల్లుకు తెలంగాణ రాజ్‌భవన్ నుంచి రాని అనుమతి
TeluguStop.com

తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్టీసీ బిల్లు ఇంకా రాజ్‌భవన్ లోనే ఉంది.


ఈ మేరకు ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నుంచి అనుమతి రాలేదు.


ఆర్థిక పరమైన బిల్లు కావడంతో గవర్నర్ అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం బిల్లును రాజ్‌భవన్ కు పంపింది.
ఈ క్రమంలో గవర్నర్ తమిళిసై అనుమతి తరువాత ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టనుంది.
ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులగా పరిగణిస్తూ ఇటీవల కేసీఆర్ కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
అయితే ఇప్పటికే ప్రభుత్వం పంపిన మూడు బిల్లులను గవర్నర్ తమిళిసై వెనక్కి పంపిన సంగతి తెలిసిందే.
పంచాయతీరాజ్, విద్యాశాఖ మరియు మున్సిపల్ శాఖలకు చెందిన బిల్లులను ఆమె వాపస్ పంపారు.
గతంలో పది బిల్లులలో రెండు బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించడంతో మరో రెండు బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు.
చెరసాల మూవీ రివ్యూ అండ్ రేటింగ్!