సెట్స్ లో సుధా చంద్రన్ అలా ఉంటారంటున్నా సీరియల్ నటి?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు నటి మధుమిత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మధుమిత అంటే తెలుగు ప్రేక్షకులు అంతగా గుర్తు పట్టకపోవచ్చు కానీ నెంబర్ వన్ కోడలు సీరియల్ లో మధుమిత అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు.

బుల్లితెర పై ప్రసారమయ్యే సీరియల్స్ లో నటించే నటీనటుల పేర్లు చాలా మందికి తెలియదు.

కానీ సీరియల్ లో పాత్ర పేరు చెబితే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు.మధుమిత మొదట మనసున మనసై అనే సీరియల్ తో తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది.

ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారం అవుతున్న నెంబర్ వన్ కోడలు సీరియల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇందులో అందం, అమాయకత్వం కలగలిసిన సరసు అనే పాత్రలో నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.

ఇప్పుడు మధుమిత కి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాల గురించి మనం తెలుసుకుందాం.

మధుమిత బెంగళూరు లో పుట్టి, పెరిగి అక్కడే విద్యాభ్యాసం కూడా చేసింది.ఇక చిన్నప్పటినుంచి ఆమెకు సాంస్కృతిక కార్యక్రమాలు ఇష్టం ఉండటం తో స్కూల్, కాలేజీలో ఏ ఫంక్షన్ జరిగినా కూడా ఆమె పాల్గొనేది.

అలా తనకు నటన పై ఉన్న మక్కువతో తల్లిదండ్రులు స్నేహితుల కోరికమేరకు సీరియల్స్ ఆడిషన్స్ కు వచ్చి అవకాశాన్ని అందుకుంది.

అలా మొదటగా స్టార్ సువర్ణ ఛానల్ లో ఫుత్మల్లి సీరియల్ లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

అలా ఆ సీరియల్ లో బాగా నటించి మనసున మనసై అనే సీరియల్లో అవకాశం అందుకుంది.

ఆ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. """/"/ తెలుగులో కాకుండా ఆమె తమిళంలో కూడా ఒక సీరియల్ లో నటించింది.

మొదట్లో తెలుగు సీరియల్స్ నటించడం కాస్త కష్టంగా అనిపించినప్పటికీ ఆమె తెలుగు భాషను ప్రేమించి తొందరగా నేర్చుకోవడమే కాకుండా ప్రస్తుతం తెలుగు లో కూడా మాట్లాడగలుగుతోంది.

మనసున మనసై సీరియల్ తర్వాత జీ తెలుగులో ప్రసారం అవుతున్న నెంబర్ వన్ కోడలు సీరియల్ లో అవకాశాలు దక్కించుకుంది.

"""/"/ ఆ సీరియల్ లో సీనియర్ నటి డాన్సర్ సుధా చంద్రన్ తో నటించే అవకాశాన్ని ఆమె దక్కించుకోవడమే కాకుండా ఆమెతో పని చేయడానికి మొదట్లో చాలా భయపడిందట.

కానీ షూటింగ్ ప్రారంభం అయ్యాక సుధా చంద్రన్ అందరితో బాగా కలిసిపోవడంతో పాటు బాగా ఫ్రెండ్లీ గా కూడా ఉంటారట.

అలా మధుమిత కి ఏ సందేహం వచ్చినా కూడా వెంటనే సుధాచంద్రన్ దగ్గరికి వెళ్లి అడిగి తెలుసుకునే దట.

ఆమె కూడా ఎంతో ఓపిగ్గా సమాధానం చెప్పేదట.

కార్తీ డైరెక్టర్ తో నాని సినిమా చేస్తున్నాడా..?