షకీల్‌ యూటర్న్‌, అసలేం జరిగింది?

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఇటీవల బీజేపీలో చేరడం దాదాపు ఖాయం అంటూ అంతా అనుకున్నారు.

ఆయన బీజేపీ ఎంపీ అరవింద్‌తో భేటీ అయ్యి త్వరలోనే మీ పార్టీలో జాయిన్‌ అవుతానంటూ పెద్దల సమక్షంలో పార్టీ తీర్థం తీసుకుంటానంటూ చెప్పుకొచ్చాడు.

ఆ తర్వాత మీడియా ముందు కూడా తాను టీఆర్‌ఎస్‌లో ఉండటం వల్ల చాలా నష్టపోతున్నాను.

మైనార్టీ అయినందుకు నన్ను పట్టించుకోవడం లేదు అంటూ మీడియా ముందు వచ్చి మరీ కామెంట్స్‌ చేశాడు.

సోమవారం నాడు తాను కీలక ప్రకటన చేయబోతున్నట్లుగా కూడా షకీల్‌ ప్రకటించాడు.షకీల్‌ హడావుడి చేసిన రెండు రోజుల్లోనే పార్టీ అధినాయకత్వం ఆయన్ను దారిలోకి తెచ్చుకుంది.

కేటీఆర్‌తో పాటు మరో ముఖ్యనేత దౌత్యంతో షకీల్‌ అలక వీడాడు.నేడు ఆయన మాట్లాడుతూ నాకు రాజకీయ గురువు కేసీఆర్‌ గారు, ఆయన్ను వదిలేనే నును ఏ పార్టీకి వెళ్లను.

తాను పార్టీ మారబోతున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని, తాను టీఆర్‌ఎస్‌లోనే ఎప్పటికి ఉంటాను అంటూ ప్రకటించాడు.

ఈ ప్రకటన వెనుక పదవి ఆశ చూపించడం జరిగిందని కొందరు అంటున్నారు.కేటీఆర్‌ స్వయంగా షకీల్‌తో మాట్లాడుతూ అతి త్వరలోనే ఒక నామినేటెడ్‌ పోస్ట్‌ ఇస్తామని హామీ ఇచ్చారు.

ప్రస్తుతం క్యాబినెట్‌లో మైనార్టీ వర్గంకు చెందిన మహమూద్ అలీ ఉన్నాడు.అందుకే మీకు ఛాన్స్ ఇవ్వలేమని షకీల్ ను ఒప్పించినట్లుగా తెలుస్తోంది.

పురుషులు తలస్నానం చేసేటప్పుడు ఈ చిన్న ట్రిక్ ను పాటిస్తే జుట్టు రాలమన్నా రాలదు!