లక్ష్మణుడు లేని రామాలయం ఎక్కడుందో తెలుసా?

రామాలయం అంటే ఆలయంలో సీతారాములతో పాటు లక్ష్మణుడు, హనుమంతుడు కొలువుదీరి ఉంటారు.ఈ విధంగా కొలువుదీరి ఉంటేనే అది రామాలయం అనే విషయం మనకు ఇదివరకు తెలుసు.

అదే విధంగా రామాయణం గురించి వింటే రాముడు జననం నుంచి పట్టాభిషిక్తుడై అయ్యే వరకు కూడా రాముడి వెంట లక్ష్మణుడు ఉంటాడు.

కానీ లక్ష్మణుడు లేని రాముని గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ విధంగా లక్ష్మణుడి విగ్రహం లేకుండా కేవలం సీతారాములు సతీ సమేతంగా కొలువై ఉన్న ఆలయం ఒకటి ఉంది.

ఈ ఆలయంలో లక్ష్మణుడు లేకుండా సీతారాములు, హనుమంతుడు కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తున్నాడు.ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉందో? ఈ ఆలయ చరిత్ర ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

నిజామాబాద్ జిల్లాలో ఈ ఏడాది శ్రీరామనవమి వేడుకలు ఎంతో అట్టహాసంగా జరిగాయి.అయితే నిజామాబాద్ జిల్లా,ఇందల్వాయి గ్రామంలో రామాలయం ఉంది ఈ రామాలయం మిగతా ఆలయాల మాదిరిగా కాకుండా ఎంతో భిన్నం.

అన్ని ఆలయాలలో సీతారామలక్ష్మణులు కొలువై ఉంటే.ఈ ఆలయంలో మాత్రం సీతారాములు కొలువై ఉన్నారు.

దాదాపు రెండు వందల ముప్పై సంవత్సరాల క్రితం రెడ్డిరాజుల కాలంలో శ్రీమతి నీలం జానకీబాయి వంశస్థులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు అక్కడ చరిత్ర చెబుతోంది.

"""/"/ ఈ ఆలయంలో స్వామివారు ఏడు అడుగుల ఎత్తు కలిగి ఉండి లక్ష్మణుడు లేకుండా, ఒకే శిలపై దశావతారాలతో పాటు, సీతమ్మ తల్లిని తన తొడపై కూర్చోబెట్టుకుని భక్తులకు దర్శనం ఇస్తున్నారు.

ఈ ఆలయంలో సీతాసమేతంగా హనుమంతుడు కొలువై ఉండి పూజలందుకుంటున్నాడు.కానీ ఈ ఆలయంలో లక్ష్మణుడు లేకపోవటం వల్ల లక్ష్మణుడు లేని ఆలయంగా ప్రాచుర్యం పొందింది.

ఈ విధంగా లక్ష్మణుడు లేకుండా సీతారాములు కొలువై ఉన్న ఆలయాలలో ఇది మొట్టమొదటి ఆలయం కావడం విశేషం.

కెనడా ఎన్నికలు.. ముందస్తు పోలింగ్‌పై ప్రజల ఆసక్తి , భారీగా ఓటింగ్