మరికాసేపట్లో నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం !
TeluguStop.com
నిజామాబాద్ స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది.
నిజామాబాద్‌లోని పాలిటెక్నిక్ కాలేజీలో ఇప్పటికే ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది.రెండు రౌండ్లలో కౌంటింగ్ పక్రియ పూర్తి కానుంది.
ఓట్ల కౌంటింగ్ కు ఆరు టేబుళ్లు ఏర్పాటు చేశారు.ప్రతీ టేబుల్‌కు ముగ్గురు లెక్కల సిబ్బంది ఉంటారు.
మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరిగింది.మొత్తం ఓట్ల లెక్కింపు పూర్తైన తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ ఫలితాన్ని ప్రకటిస్తారు.
మొత్తం 824 మంది ఓటర్లు ఉండగా 821 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు వేశారు.
ప్రాధాన్య ఓటింగ్ విధానంలో జరిగిన ఈ ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రత్యేకంగా ఉండబోతుంది.
ఈ ఎన్నికల్లో గెలుపు తమదేననే ఫుల్ కాన్ఫిడెన్స్ లో ఉన్న టీఆర్ ఎస్ శ్రేణులు.
భారీ ఎత్తున సంబరాలు చేసుకునేందుకు సిద్ధమైయ్యారు.ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో మొత్తం 824 మంది ఓటర్లు ఉన్నారు.
వీరిలో బోధన్ కు చెందిన ఓ కౌన్సిలర్ చనిపోగా, మరో ఇద్దరు ఓటర్లు కరోనా వల్ల పోస్టల్ బ్యాలెట్ ను ఎంచుకున్నారు.
9న జరిగిన ఎన్నికల్లో 99.64 శాతం పోలింగ్ నమోదైంది.
821 మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కామారెడ్డి జిల్లాలో 100 శాతం కాగా నిజామాబాద్ లో 99.64 శాతం మంది ఓటేశారు.
మొదటి రౌండ్‌లో 600 ఓట్లు లెక్కిస్తారు.రెండో రౌండ్ లో మిగిలిన 221 ఓట్లను కౌంట్ చేస్తారు.
మొత్తం రెండు రౌండ్ల తర్వాత ఆయా పార్టీల అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు ఏమైనా ఉంటే తీసుకోని , మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి , ఈసీ అనుమతితో ఎవరు గెలిచిందీ ప్రకటిస్తారు.
మొత్తం ప్రక్రియకు 2 గంటల్లో పూర్తవ్వనుంది.అంటే దాదాపుగా 10 గంటల లోపల అధికారికంగా ఫలితం వెలువడనుంది.
కొమొడో డ్రాగన్ Vs గేదె.. గెలుపెవరిది? వైరల్ వీడియో