నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి సరికొత్త రికార్డ్
TeluguStop.com
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల పని తీరు మారుతోంది.కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా రోగులకు వైద్యాన్ని అందిస్తున్నారు డాక్టర్లు.
ఒకప్పుడు ప్రభుత్వాస్పత్రి అంటేనే భయాందోళనకు గురయ్యే వారు.కానీ ప్రస్తుతం రోగులతో ప్రభుత్వ ఆస్పత్రులు నిండిపోతున్నాయి.
రాష్ట్రంలో సర్కార్ దవాఖానాలు సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి.ఇందుకు నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించిన ఆపరేషన్లే నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలోని వైద్యులు 24 గంటల్లో 59 ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసి రికార్డ్ సృష్టించారు.
ఈనెల 26వ తేదీన గైనిక్ సర్జరీలు -20, ఆర్థోపెడిక్ ఆపరేషన్లు -8, జనరల్ సర్జరీలు -9, ఈఎన్టీ -2, ఆప్తల్మాలజీ -20 ఆపరేషన్లు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పని తీరుపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గోవాలో ఆ వ్యక్తి కోసం మందు కొన్న బన్నీ… అసలు విషయం రివీల్..ఎవరా స్పెషల్ పర్సన్?