ఆర్మూరు లో రైతుల మహా ధర్నా!

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ పరిధిలో పసుపు, ఎర్రజొన్న పంటలకి గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరుతూ ఆ మధ్య రైతులు రాస్తారోకో నిర్వహించి, జాతీయ రహదారిపై బైఠాయించిన సంగతి అందరికి తెలిసిందే.

ఇక మరోసారి రైతులు రోడ్డెక్కి ధర్నాకి చేసారు.డివిజన్ పరిధిలో 14 మండలాలకి చెందిన రైతులు పాదయాత్రగా మామిడిపల్లి చౌరస్తాకి తరలివెళ్లి అక్కడ ధర్నాకి దిగారు.

కస్టపడి పండించిన పంటకి మద్దతుధర అడిగితే ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం చాలా దారుణమని అన్న రైతులు, తాము పండించిన పంటలకి మద్దతు ధర ఇచ్చేంత వరకు ఈ ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు.

రైతుల ధర్మా నేపధ్యంలో ఆర్మూర్ లో పోలీసులు 144 సెక్షన్ విధించారు.మరి రైతుల డిమాండ్లకి ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుంది అనేది వేచి చూడాలి .