కైలాస దేశం.. నిత్యానంద ప్రత్యేకం

ఆధ్యాత్మికత ముసుగులో రాసలీలు చేస్తూ అడ్డంగా బుక్కయిన నిత్యానంద, ప్రస్తుతం భారతదేశం వదిలి పారిపోయాడు.

ఆయన ఎక్కడున్నాడనే అంశం నెమ్మదిగా బట్టబయలవుతోంది.పసిఫిక్ సముద్రంలోని విదేశాలకు వెళ్లిపోయిన నిత్యానంద అక్కడ ఎవ్వరి ఊహలకు అందని పనులు చేస్తున్నాడు.

ఈక్వెడార్ దేశం నుంచి ఏకంగా ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేశాడు.బాలికల కిడ్నాప్ కేసులో అరెస్టుల నుండి తప్పించుకునేందుకు పారిపోయిన నిత్యానంద, ఈక్వెడార్ దేశం నుంచి సొంతం చేసుకున్న ద్వీపాన్ని కైలాస దేశంగా నామకరణం చేశారు.

ఈ దేశానికి సంబంధించి ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశాడు నిత్యానంద.తమ దేశానికి సంబంధించి జాతీయ చిహ్నం, జాతీయ పతాకం, పాస్‌పోర్టును కూడా ఏర్పాటు చేశాడు నిత్యానంద.

తమ దేశానికి సరిహద్దులు లేవని, హిందూధర్మ పునరుద్ధరణే తన లక్ష్యమని నిత్యానంద తన వెబ్‌సైట్‌లో పేర్కొన్నాడు.

""img "aligncenter" Src="" / నిత్యానంద తన దేశానికి సార్వభౌమత్వాన్ని ఇవ్వాలని ఇతర దేశాలను కోరుతున్నాడు.

ఏదేమైనా ప్రస్తుతం నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచాడని, ఓ దేశాన్నే ఏర్పాటు చేస్తున్న నిత్యానంద నిజంగా ప్రత్యేక వ్యక్తి అంటూ పలువురు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

మరి నిత్యానంద అరెస్ట్ విషయంలో పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ఆస్ట్రోటాక్ జ్యోతిష్యుడి పరువు గంగపాలు.. పెళ్లయిన ఆమెకే మళ్లీ పెళ్లి అంటూ?