సూపర్ స్టార్ చేతుల మీదుగా ‘మామ మశ్చీంద్ర’ టీజర్.. డేట్ అండ్ టైం ఫిక్స్!
TeluguStop.com
మహేష్ బాబు బావగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు సుధీర్ బాబు (Sudheer Babu) .
యంగ్ అండ్ డెడికేషన్ ఉన్న హీరోల్లో సుధీర్ బాబు ఒకరు.ఈయన ముందు నుండి సినిమాల్లో తన డెడికేషన్ చూపిస్తూనే ఉన్నాడు.
సినిమాల మీద ఉన్న పాషన్ కారణంగా సుధీర్ బాబు సినిమా లోకి వచ్చి నైట్రో స్టార్ (Nitro Star) గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతో ఆకట్టుకోలేక పోయిన రెండవ సినిమాతోనే మంచి హిట్ అందుకుని హీరో మెటీరియల్ అనిపించాడు.
ఇక ప్రజెంట్ సుధీర్ బాబు నటిస్తున్న సినిమాల్లో ''మామ మశ్చీంద్ర'' (Mama Mascheendra) ఒకటి.
ఈ సినిమాను ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్ధన్ (Harsha Vardhan) తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా ముందు నుండి ఇంట్రెస్టింగ్ గా ఉంది.
ఎందుకంటే ఇందులో సుధీర్ బాబు మొత్తం మూడు రోల్స్ ప్లే చేస్తున్నాడు. """/" /
ఇప్పటికే వీటి ఫస్ట్ లుక్ కూడా రాగా మూడు కూడా డిఫరెంట్ రోల్స్ లా అనిపిస్తున్నాయి.
దుర్గ, పరశురామ్, డీజే గా ఇందులో సుధీర్ అలరించనున్నాడు.ఇలా ట్రిపుల్ రోల్ చేస్తూ ఈ సినిమాపై భారీ హైప్ పెంచేశారు.
ఇదిలా ఉండగా నిన్న ఈ సినిమా టీజర్ నుండి అప్డేట్ వచ్చిన విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు మరో సాలిడ్ అనౌన్స్ మెంట్ చేసారు మేకర్స్. """/" /
ఈ సినిమా టీజర్ (Mama Mascheendra Teaser) ను ఏప్రిల్ 22న ఉదయం 11 గంటల 33 నిముషాలకు సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) చేతుల మీదుగా లాంచ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసారు.
మరి మహేష్ ఈ టీజర్ ను లాంచ్ చేయడంతో ఇది సినిమాకు మంచి బూస్ట్ అనే చెప్పాలి.
ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్, ఎల్ ఎల్ సి పి వారు నిర్మిస్తుండగా.
చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.అలాగే మృణాళిని రవి, ఈషా రెబ్బ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.