ముసలి గెటప్ లో ఉన్న నితిన్ శ్రీలీలా…ఇదంతా ఆ సినిమా కోసమేనా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు నితిన్( Nithin ).
జయం సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా తనదైన రీతిలో నటించి మెప్పిస్తున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన వెంకీ కుడుముల డైరెక్షన్ లో రాబిన్ హుడ్ అనే సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
అయితే ఈ సినిమాలో శ్రీిలీలా ( Sreleela )హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ కొట్టాలని నితిన్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఇక ఇంతకు ముందే ఆయన వరుస సినిమాలను చేసినప్పటికీ అవి ఏవి కూడా ఆయనకు ఆశించిన మేరకు విజయనైతే అందించలేకపోతున్నాయి.
"""/" /
కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే తనను తాను మరొకసారి స్టార్ హీరో గా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు.
ఇక ఇప్పటికే తన తోటి నటులైన నాని,విజయ్ దేవరకొండ, అఖిల్ లాంటి నటులు వరుస సినిమాలతో సక్సెస్ లని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.
మరి ఈయన మాత్రం ఇక్కడే ఢీలా పడిపోతున్నాడు.ఇక ఇలాంటి సందర్భంలో ఎలాగైనా సరే ఈ సినిమా తో సక్సెస్ కొట్టాలనే ఉద్దేశ్యంతోనే ఇంతకుముందు తనకు భీష్మ లాంటి ఒక అదిరిపోయే సక్సెస్ ని ఇచ్చిన వెంకీ కుడుములనే మళ్ళీ నమ్ముకున్నాడు.
"""/" /
మరి ఈ సినిమాతో తనకు ఎలాంటి సక్సెస్ వస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక ఇదిలా ఉంటే రాబిన్ హుడ్ సినిమా( Robin Hood Movie ) కి సంబంధించిన ఒక వీడియో ను రీసెంట్ గా వెంకి కుడుముల తన ట్విట్టర్ అకౌంట్ నుంచి రిలీజ్ చేశాడు.
ఇందులో రాబిన్ హుడ్ ఆఫ్టర్ 25 ఇయర్స్ అని చెబుతూ ముసలి గెటప్ లో ఉన్న నితిన్ శ్రీ లీలా ను చూపించాడు.
అలాగే శ్రీలీలా మీద పంచులు కూడా వేసినట్టుగా తెలుస్తుంది.
వైరల్ వీడియో: సిక్సర్ వెళ్లిన బంతిని తీసుకుని పారిపోయిన అభిమాని