Chayoos Nitin Saluja : లక్షల జాబ్ వదిలేశాడు.. టీ అమ్మి రూ.100 కోట్ల టర్నోవర్.. నితిన్ సలూజా సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

కెరీర్ పరంగా సక్సెస్ సాధించాలంటే తెలివిగా పెట్టుబడులు పెట్టడం ఎంతో అవసరమనే సంగతి తెలిసిందే.

టీ కేఫ్ చైన్ చాయోస్ వ్యవస్థాపకుడు నితిన్ సలూజా( Chayoos Founder Nitin Saluja ) సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఐఐటీ పూర్వ విద్యార్థి అయిన నితిన్ సలూజా చదువు పూర్తైన తర్వాత అమెరికా చేరుకుని ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగిగా చేరారు.

అక్కడ లక్షల్లో వేతనం వస్తున్నా ఆ వేతనం నితిన్ కు సంతృప్తిని ఇవ్వలేదు.

సొంతంగా ఏదైనా చేయాలని భావించిన నితిన్ కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదిగి చాయోస్( Chayoos ) పేరుతో టీ కేఫ్ కంపెనీని మొదలుపెట్టి తక్కువ సమయంలోనే కెరీర్ పరంగా సక్సెస్ అయ్యారు.

2012 సంవత్సరంలో నితిన్ అతని స్నేహితులతో కలిసి ఈ కంపెనీని ప్రారంభించగా ఈ బిజినెస్ ను మొదలుపెట్టిన సమయంలో నితిన్ కు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి.

"""/"/ 2020 సంవత్సరంలో ఈ కంపెనీ 100 కోట్ల రూపాయల ఆదాయాన్ని సొంతం చేసుకుంది.

ప్రస్తుతం దేశంలో 200 కంటే ఎక్కువగా చాయోస్ కేఫ్ లు ఉండగా దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో చాయోస్ కేఫ్ లు ఉన్నాయి.

ప్రీమియం టీ తాగాలని భావించే వాళ్లు చాయోస్ కేఫ్ లపై దృష్టి పెట్టవచ్చు.

మన దేశానికి చెందిన వాళ్లు కోరుకునే అన్ని రుచుల టీలను ఈ టీ కేఫ్ ద్వారా తాగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

నితిన్ సలూజా సక్సెస్ స్టోరీ ( Nitin Saluja Success Story ) నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

"""/"/ ఐఐటీ ముంబై( IIT Mumbai ) నుంచి ఉత్తీర్ణత సాధించిన నితిన్ సలూజా తన పడిన కష్టానికి తగ్గ ఫలితం సాధించారు.

కష్టపడి తెలివినే పెట్టుబడులుగా పెడితే ఏదో ఒకరోజు కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందని నితిన్ సలూజా మరోసారి ప్రూవ్ చేశారు.

నితిన్ సలూజా రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించాలని నెటిజన్లు భావిస్తున్నారు.

అణుదీప్ కేవి ఇప్పుడు చేయబోయే సినిమాతో స్టార్ డైరెక్టర్ అవుతాడా..?