జీ5 కాదు డిస్నీ హాట్ స్టార్ లో మాస్ట్రో..!

నితిన్ హీరోగా మేర్లపాక గాంధ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా మాస్ట్రో.బాలీవుడ్ లో సూపర్ హిట్టైన అందాధున్ అఫీషియల్ రీమేక్ గా ఈ సినిమా వస్తుంది.

సినిమాలో నితిన్ సరసన నభా నటేష్, మిల్కీ బ్యూటీ తమన్నాలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

హిందీలో టబు నటించిన పాత్రలో ఇక్కడ తమన్నా అదరగొట్టిందని తెలుస్తుంది.సినిమాలో నితిన్ బ్లైండ్ మ్యాన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

థియేట్రికల్ రిలీజ్ రిస్క్ అని భావించిన నితిన్ మాస్ట్రో సినిమాను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

అయితే జీ 5 లో రిలీజ్ అవుతుందని కొన్నాళ్లుగా ప్రచారం జరిగిన ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్ కు డిజిటల్ రైట్స్ అమ్మినట్టు తెలుస్తుంది.

"""/"/ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా స్టార్ మా సొంతం చేసుకుంది.నితిన్ మాస్ట్రో డైరెక్ట్ గా ఓటిటిలో రిలీజ్ అవుతుంది.

ఈ సినిమాకు డిస్నీ హాట్ స్టార్ నుండి మంచి ఆఫర్ రావడంతో డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ కు సై అన్నారు మేకర్స్.

రంగ్ దే తర్వాత నితిన్ చేస్తున్న మాస్ట్రో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఆల్రెడీ హిందీలో హిట్ అయిన సినిమా కాబట్టి ఈ సినిమా ఇక్కడ కూడా అదే రిజల్ట్ రిపీట్ చేస్తుందని అంటున్నారు.

అందమైన చీర కట్టుకుని రష్యా వీధుల్లో తిరిగిన భారతీయ యువతి.. వీడియో వైరల్!