ఆ విషయం లో ఎన్టీయార్, అల్లు అర్జున్ లతో పోటీ పడుతున్న నితిన్…
TeluguStop.com
ప్రస్తుతం నితిన్( Nithiin ) వరుస ప్లాపులతో కెరీయర్ లో సతమతమవుతున్నాడు.ఒకప్పుడు 14 ఫ్లాపులు వచ్చిన కూడా తట్టుకున్న నితిన్ ఇప్పుడు రెండు మూడు ప్లాప్ లకే విలవిల్లాడుతున్నాడు.
ఎందుకంటే ఫ్లాప్ లో నుంచి బయటికి వచ్చి మంచి హీరోగా కొనసాగుతున్నాడు.కాబట్టి మరొకసారి ప్లాప్ లు వస్తాయేమో ఇంతకుముందు లాగే ఇప్పుడు కూడా తన కెరీర్ అనేది ఇబ్బందుల్లో పడుతుందా ఏంటి అనే విషయం బాగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది.
"""/" /
అయితే ఇప్పటికే నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్(Extra Ordinary Man) సినిమాతో భారీ ప్లాప్ ని అందుకున్నాడు.
ఇక ఈ సినిమా విషయాన్ని వదిలిపెడితే నితిన్ వెంకీ కుడుముల డైరెక్షన్ లో మరొక సినిమా చేస్తున్నాడు.
ఇక ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ లో భీష్మ సినిమా వచ్చింది.ఆ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో నితిన్ హీరో గా మంచి గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు.
ఇక ఇప్పుడు వెంకి కుడుముల డైరెక్షన్ లో నటిస్తున్న సినిమాలో నితిన్ పంతులు క్యారెక్టర్ లో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.
అయితే సినిమా మొత్తం అదే క్యారెక్టర్ ఉంటుందా లేదంటే మధ్యలో ఏమైనా వేరియేషన్స్ ఉన్నాయా అనేది మాత్రం కరెక్ట్ గా తెలియడం లేదు.
ఇక ఇప్పటికే పంతులు పాత్రలో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లు నటించి వాళ్ళకంటు ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నారు.
"""/" /
ఇక ఈ విధంగా తనకంటూ ఒక సపరేట్ మ్యనరిజాన్ని సృష్టించుకుంటూ ముందుకెళ్తాడా లేదా అనే విషయాల మీదనే ఇప్పుడు చాలా డౌట్లు కొడుతున్నాయి.
ఒకవేళ కొంచెం అటు ఇటు అయిన కూడా వాళ్ల తో నితిన్ ని పోలుస్తూ చాలా విమర్శలు ఎదురుకోవాల్సి ఉంటుంది.
ఇక ఇలాంటి క్యారెక్టర్ ని ఎంచుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ముందుకెళ్ళాలి అంతే తప్ప మధ్యలో ఏదైనా డిస్టబెన్స్ వచ్చినట్లయితే మాత్రం మొదటికే మోసం వస్తుంది.
పుత్రికోత్సాహంలో జగన్.. మమ్మల్ని ఎంతో గర్వపడేలా చేసావంటూ ట్వీట్