బన్నీని తీసుకు వస్తేనే నితిన్ చేయబోతున్న ఆ సినిమా సేఫ్‌!

అల్లు అర్జున్‌ ఆ మద్య 'ఐకాన్‌' ( ICON ) సినిమా చేయబోతున్నాడు అంటూ పెద్ద ఎత్తున చర్చలు జరిగిన విషయం తెల్సిందే.

వేణు శ్రీరామ్ ( Venu Sriram ) దర్శకత్వం లో బన్నీ ఆ సినిమా ను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

దర్శకుడు వేణు శ్రీరామ్‌ రూపొందించిన వకీల్ సాబ్‌ ( Vakeel Saab ) భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి.

అంచనాలకు తగ్గట్లుగా సినిమా ను అద్భుతంగా రూపొందిస్తాను అంటూ మీడియా ముందు దర్శకుడు ఒకటి రెండు సార్లు చెప్పాడు.

"""/" / కానీ అల్లు అర్జున్‌ ( Allu Arjun )నుండి అదుగో ఇదుగో అంటూ వాయిదాల పర్వం తప్పలేదు.

దాంతో దర్శకుడు వేణు శ్రీరామ్‌ సమయం చాలా వృదా అయ్యింది.ఎట్టకేలకు అదే కథతో అదే టైటిల్‌ తో దర్శకుడు వేణు శ్రీరామ్‌ వెళ్లి యంగ్‌ హీరో నితిన్ ( Nithiin ) ను ఒప్పించడం జరిగిందట.

అల్లు అర్జున్ నుండి ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ ఒక సంకేతం వచ్చిన తర్వాత మాత్రమే నితిన్ ఈ సినిమా ను కమిట్‌ అయ్యాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఆ విషయం లో క్లారిటీ లేదు.అల్లు అర్జున్‌ మరియు నితిన్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

"""/" / .అల్లు అర్జున్‌ ఓకే చెప్పిన తర్వాత మాత్రమే నితిన్‌ ఐకాన్ సినిమా ను చేస్తున్నాడు అంటూ ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

అది కేవలం నితిన్‌ ఐకాన్ సినిమా ప్రారంభోత్సవంకు లేదా ఏదైనా సినిమా వేడుకకి అల్లు అర్జున్ వస్తేనే సెట్‌ అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అల్లు అర్జున్‌ అభిమానులు తమ హీరో ఐకాన్ టైటిల్‌ ను మరియు కథ ను తీసుకున్నారని నితిన్ సినిమా ను ట్రోల్‌ చేస్తే కచ్చితంగా నష్టం తప్పదు.

అందుకే ముందుగానే బన్నీ తో మాట్లాడుకుని ఆయన్ను ఓపెనింగ్‌ కు తీసుకు వస్తేనే అభిమానులు శాంతిస్తారు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆ బాలీవుడ్ హీరోలు పనికిరారు అని రిజెక్ట్ చేసిన రామ్‌ గోపాల్ వర్మ..?