నితిన్ సినిమా బయర్లు మళ్లీ నిండా మునిగినట్లేనా?

నితిన్‌ ( Nithiin )హీరో గా శ్రీలీల హీరోయిన్‌ గా రచయిత వక్కంతం వంశీ దర్శకత్వం లో రూపొందిన ఇటీవలే విడుదల అయిన చిత్రం ఎక్స్‌ట్రా ఆర్డినరీ( Extra Ordinary Man ).

నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ సినిమా ను సొంత బ్యానర్‌ లో నిర్మించాడు.

నితిన్‌ గత చిత్రాల ఫలితాలు, వక్కంతం వంశీ గత చిత్రం ఫలితం గురించి బయ్యర్లు పట్టించుకోకుండా సినిమా కు వచ్చిన బజ్‌ నేపథ్యం లో భారీగా పెట్టుబడి పెట్టి కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు.

దాంతో నిర్మాత సుధాకర్ రెడ్డికి విడుదలకు ముందే దాదాపుగా బ్రేక్ ఈవెన్‌ నమోదు అయిందనే వార్తలు వచ్చాయి.

"""/" / తాజాగా సినిమా విడుదల అయ్యి బయ్యర్లకు పెట్టుబడి లో కనీసం 30 శాతం కూడా వెనక్కి రాలేదు అంటూ బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

మరీ ఇంత నష్టం భరించడం మా వల్ల కాదు అంటూ సుధాకర్ రెడ్డి( Sudhakar Reddy ) ని బయ్యర్లు సంప్రదించగా ఆయన ఆదుకుంటాను అంటూ హామీ ఇచ్చాడట.

అయితే గతంలో కూడా నితిన్‌ సినిమాల వల్ల బయ్యర్లు నిండా మునిగారు.ఈసారి ఎంత వరకు నిర్మాత బయ్యర్లను ఆదుకుంటాడు అనే విషయం లో క్లారిటీ లేదు.

అందుకే సినిమా వల్ల కచ్చితంగా బయ్యర్లు మునిగి పోవడం ఖాయం అంటున్నారు. """/" / సినిమా యొక్క విలువ మరియు హీరో దర్శకుడి ఇమేజ్ ఇంకా వారి గత చిత్రాల ఫలితాలను బేరీజు వేసుకుని బయ్యర్లు సినిమా లు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది.

లేదంటే ఇలా భారీ గా నష్టపోవాల్సి వస్తుంది.శ్రీ లీల( Sreeleela ) ఉండటం వల్ల సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని బయ్యర్లు ఆశించి ఉంటారు.

కానీ ఆమెకు కూడా అప్పుడే బ్యాడ్‌ టైమ్‌ మొదలు అయ్యి ఉంటుంది.అందుకే బ్యాక్ టు బ్యాక్‌ అట్టర్ ఫ్లాప్‌ సినిమా లు పడుతున్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి23, గురువారం 2025