మెగా ఫోన్ పట్టుకోబోతున్న నిత్యా మీనన్

అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మలయాళీ ముద్దుగుమ్మ నిత్యా మీనన్.

మొదటి సినిమాతోనే టాలెంటెడ్ నటి అనిపించుకున్న నిత్యా మీనన్ ఈ బాషలో సినిమా చేసిన ఆ బాషలో తనకి తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటుంది.

ఇలా ఇప్పటి వరకు సౌత్ భాషలు అన్ని కూడా ఈ ముద్దుగుమ్మ నేర్చుకుంది.

ఇక గాయకురాలిగా కూడా ఆమె తన సత్తా చాటింది.ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు హీరోయిన్ పాత్రలు పెద్దగా చేయడం లేదు.

ఒక జయలలిత బయోపిక్ లో మాత్రమే నటిస్తుంది.ఇదిలా ఉంటే ఈ అమ్మడు మెగా ఫోన్ పట్టుకొని దర్శకురాలి అవతారం ఎత్తడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.

తన సినిమాల సమయంలో దర్శకత్వంపై కూడా మెలుకువలు నేర్చుకున్న నిత్యా మీనన్ లో రచయిత కూడా ఉంది.

ఈ మధ్య కాలంలో అమ్మడు కథలు రాయడంలో మరింత ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు సమాచారం.

ఇక లాక్ డౌన్ సమయంలో మంచి లవ్ స్టొరీ రాసిందని ఈ కథతో సినిమా చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.

నటిగా తన కమిట్మెంట్స్ అన్ని అయిపోయాక దర్శకత్వం చేసే పని మొదలు పెడుతుంది అని సమాచారం.

దీనికి మరో రెండేళ్ళు తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తుంది.ఇక ఈమె దారిలోనే మరో మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కూడా దర్శకురాలిగా మారడానికి రెడీ అవుతుంది.

ఇప్పటికే తాను నటించిన ఒక మలయాళీ సినిమాకి అసిస్టెంట్ దర్శకురాలిగా కూడా పని చేసింది.

ఇక దబిడి దిబిడే.. భారత్ లో కాలుమోపిన HMPV వైరస్