Nithya Menon : వామ్మో షూటింగ్ సెట్ లో నిత్య మీనన్ ఇలా చుక్కలు చూపిస్తుందా ?
TeluguStop.com
చాల మంది బయటకు ఒకలా, లోపల ఇంకోలా ఉంటారు.సినిమా ఇండస్ట్రీ కి వచ్చేసరికి ఇలాంటివి మరి ఎక్కువగా ఉంటాయి.
సినిమాలో కనిపించేంత అందంగా వారు నిజజీవితం లో ఉండరు.అలాగే ప్రవర్తించే విధానం కూడా షూటింగ్ సెట్ లో ఉంటె ఒకలా, పబ్లిక్ ఈవెంట్స్ లో ఉంటె మరోలా ఉంటుంది.
ఇందుకు మహానటి తో పోల్చబడుతున్న నిత్య మీనన్( Nitya Menon ) కూడా ఏమాత్రం తీసిపోరు.
ప్రస్తుతం ధనుష్( Dhanush ) 50 వ సినిమాలో లీడ్ రోల్ లో నటిస్తున్న నిత్య మీనన్ షూటింగ్ సెట్ కి వచ్చింది అంటే ఎలా ఉంటుందో, ఆ వివరాలు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
"""/" /
నిత్య మీనన్ నటన లో చాల ట్యాలెంటెడ్.అది ఎవరు కాదనలేని సత్యం.
ఒక్కసారి షాట్ రెడీ అనగానే ఆమెలో ఎదో ప్రవేశించినట్టుగానే చించి పడేస్తుంది.ఆమె పక్కన ఏ హీరో అయినా కూడా తేలిపోవాల్సిందే.
అంతగా ఆమె నటనలో ఈజ్ ఉంటుంది.కానీ ఇదంతా నటన వరకు మాత్రమే.
ఆమె షూటింగ్ లొకేషన్ లో మాత్రం కొంత తేడాగానే వ్యవహరిస్తోంది.ఎంతలా అంటే ఆమెను షూటింగ్ టైం లో ఏ అబ్బాయి కూడా టచ్ చేయకూడదు.
లైట్ పెట్టాలన్న, మేకప్ వేయాలన్న, కాస్ట్యూమర్, టచప్ బాయ్ నుంచి అందరు ఆమెకు ఆడవారు మాత్రమే ఉండాలి.
ఆమెకు నటిస్తున్న టైం లో ఎవరు కూడా చూస్తూనే ఉన్న కూడా నచ్చదు.
సింపుల్ గా గెట్ అవుట్ అంటూ అక్కడి నుంచి పంపించి వేస్తుంది. """/" /
ఎవరైనా ఆమె కళ్ళకు నచ్చక పోయిన సరే వారు ఆ సెట్ నుంచి వెళ్లిపోవాల్సిందే.
విపరీతమైన ఫెమినిజం ఉండే నిత్య తో దర్శకులకు( Directors ) చాల తిప్పలు ఉంటాయి.
చుట్టూ ఉంటె మొగాళ్ళ పైన ఎందుకు అంత కోపం అంటూ కొంత మంది రుసరుసలు కూడా చేస్తూ ఉంటారు.
కానీ ఇవన్నీ ఆమెకు ఏమి పట్టవు.ఆమెకు బోలెడంత ట్యాలెంట్ ఉంది.
అలాగే మంచి మార్కెట్ ఉంది.ఆమెతో సినిమా చేయాలంటే ఇవన్నీ భరించాల్సిందే.
చిన్నారి గుండె ఆగింది.. 8 ఏళ్లకే గుండెపోటుతో బాలిక మృతి.. స్కూల్‌లోనే విషాదం..!