మీడియా నన్ను మోసం చేసింది – నిత్య మీనన్

సాధారణం గా నోటికి వచ్చింది మాట్లాడి సెలబ్రిటీలు పబ్బం గడుపుకునేవారు ఉంటారు.కొంత మంది మీడియా ను పబ్లిసిటీ కోసం వాడుకుంటారు .

మరో కొంత మంది వారి సినిమా ప్రమోషన్ కోసం వాడుకుంటారు.కొందరి మీడియా అవకాశాలను ఇస్తుంది.

మరికొంత మందికి ఉన్న అవకాశాలను పోగొడుతుంది.ఇలా మీడియా ను ఆధారం చేసుకొని చాల మంది జీవిస్తున్నారు.

అయితే మీడియా చేతిలో మోసపోవడం అనే పదం వాడిన వ్యక్తి మాత్రం నిత్య మీనన్.

ఆమె తన జీవితంలో మొదటి సారి మీడియా ఎంత మోసం చేయగలదో చూసి చాల బాధ పడిన సందర్భం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు.

ఆలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయినా నిత్య మీనన్ ఈ సినిమా విడుదల తర్వాత చాల పెద్ద కాంట్రవర్సీ లో ఇరుక్కుంది.

హీరోయిన్స్ పైన గాసిప్స్ రావడం సర్వ సాధారణం అయినప్పటికి తన పైన వచ్చిన రూమర్స్ మాత్రం నిత్య తీసుకోలేకపోయింది.

ఆలా మొదలయింది సినిమాకు సంబందించిన ఒక షూట్ లో మీడియా ప్రభాస్ గురించి నిత్య ను ప్రశ్నించగా, అది సరిగ్గా వినపడకపోవడం తో ఎవరు అది అని మళ్లి అడిగిందట.

ఆమె సరిగ్గా వినిపించక ఎవరు అని అడిగితే దానికి మీడియా వలువలు చిలువలుగా ఎదో ఎదో రాసి ఆమెను బాధ పడేలా చేసింది.

"""/"/ ప్రభాస్ ఎవరో తెలియదు అంటూ నిత్య చెప్పింది అని మీడియాలో వార్తలు రావడం తో ఆమె పై ప్రభాస్ అభిమానులు ఫైర్ అయ్యారు.

ఆ వార్తలను చూసి నిత్య మీనన్ సైతం చాల భావోద్వేగానికి గురయ్యింది.నేను మాట్లాడిన దానికి మీడియాలో వస్తున్న దానికి సంబంధం లేక మీడియా పైన అప్పటి నుంచి వీలైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాను అంటూ ఆమె తెలిపింది.

ఒక రకంగా మీడియా తనను మోసం చేసినట్టే భావించాను అంటూ ఆవేదన చెందింది.

ఇలా ఒక్కోసారి మీడియా తనకు నచ్చింది తాను చేస్తూ కొంత మందిని బాధ పెట్టడం సాధారణ విషయం అయిపొయింది.

ఈ విషయాలను జనాలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు.

అధికారం వచ్చినా ఆనందం లేదా ? ఎందుకిలా ?