యూ ట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన నిత్య మీనన్.. ఫస్ట్ వీడియో ఇదే!

సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీలు అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

ఇకపోతే బుల్లితెర నటీమణుల ప్రతి ఒక్కరు సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వారికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులకు వీడియోల ద్వారా తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా నటి నిత్యామీనన్ కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు.

అలా మొదలైంది సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తెలుగులో పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు.

తాజాగా పవన్ కళ్యాణ్ సరసన భీమ్లా నాయక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

అలాగే ఆహా వేదికగా ప్రసారమౌతున్న సింగింగ్ కాంపిటీషన్ ఇండియన్ ఐడల్ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.

ఇలా ప్రస్తుతం తన కెరియర్ లో ఎంతో బిజీగా ఉన్న నిత్యామీనన్ తాజాగా సొంత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులకు తెలియజేశారు.

"""/"/ నిత్య అన్ ఫిల్టర్ అనే పేరుతో ఈమె యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు.

ఇక యూట్యూబ్ ఛానల్ ద్వారా మొదటి వీడియోగా తన 12 సంవత్సరాల సినిమా జర్నీకి సంబంధించిన విషయాలను తన తొలి వీడియోగా యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేశారు.

త్వరలోనే మరిన్ని వృత్తిపరమైన వ్యక్తిగత వీడియోలను కూడా షేర్ చేస్తానని చెప్పుకొచ్చారు.ఇక నిత్య మీనన్ షేర్ చేసినఈ వీడియో వైరల్ గా మారింది.

అలాగే యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేసిన అతి తక్కువ సమయంలోనే వేల మంది సబ్స్క్రైబర్లను సంపాదించుకున్నారు.