సినిమా ఇండస్ట్రీలో ఉండటం ఇష్టం లేదు.. నిత్యామీనన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

సినిమా ఇండస్ట్రీలో ఉండటం ఇష్టం లేదు నిత్యామీనన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ నిత్యా మీనన్(nithya Menen) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

సినిమా ఇండస్ట్రీలో ఉండటం ఇష్టం లేదు నిత్యామీనన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

నిత్యా మీనన్ తెలుగు తమిళం మలయాళం(Nithya Menen, Telugu ,Tamil, Malayalam) భాషలో ఎన్నో సినిమాలలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.

సినిమా ఇండస్ట్రీలో ఉండటం ఇష్టం లేదు నిత్యామీనన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

ప్రస్తుతం అడపాదడపా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.ఇకపోతే ఈ ముద్దుగుమ్మకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే.

సినిమాలలో తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులలో బాగానే గుర్తింపు తెచ్చుకుంది.ప్రస్తుతం కేవలం సెలెక్టివ్ గా మాత్రమే సినిమాలు చేస్తోంది నిత్యా మీనన్.

సినిమా రంగం వల్ల తనకు పేరు, ప్రఖ్యాతలు ,ఆస్తులు, అంతస్తులు అన్ని వచ్చాయి.

"""/" / అయినప్పటికీ తనకు చిత్ర పరిశ్రమలో ఉండటం ఏమాత్రం ఇష్టం లేదని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.

కాగా ఇటీవల జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా అందుకున్న ఈ మలయాళ భామ తాజాగా రవి మోహన్‌​తో(Ravi Mohan) కలిసి నటించిన చిత్రం కాదలిక్క నెరమిల్లై.

ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటున్న నిత్యా మీనన్‌ ఒక భేటీలో పేర్కొంటూ తనకు నచ్చని రంగం సినిమా అని డైరెక్ట్‌ గానే చెప్పింది.

తనకు ఏదైనా రంగంలో ఇప్పుడు అవకాశం వస్తే వెళ్లిపోతానని పేర్కొంది.సెలబ్రిటీలా కాకుండా తనకు సాధారణ జీవితాన్ని అనుభవించడమే ఇష్టమని పేర్కొంది.

అదేవిధంగా తనకు ప్రయాణం చేయడం అంటే చాలా ఇష్టం అని అందుకే పైలెట్‌ కావాలని చిన్నప్పుడు కోరుకున్నానని గుర్తు చేసుకుంది.

"""/" / కానీ, ఫైనల్‌గా నటిని అయ్యానని చెప్పింది.నటిగా స్వేచ్ఛగా జీవించడం మరిచిపోయానని ఆమె తెలిపింది.

అదేవిధంగా పార్కుల్లో నడవటం అంటే ఎంతో ఇష్టమని అయితే అది ఇప్పుడు జరగదని పేర్కొంది.

ఒక్కొక్కసారి ఇదంతా నాకు అవసరమా అని అనిపిస్తుందని చెప్పింది.జాతీయ అవార్డు రాకముందు సైలెంట్‌ గా ఎక్కడికై నా వెళ్లిపోతామని భావించానంది అలాంటి సమయంలోనే జాతీయ ఉత్తమ నటి అవార్డు వచ్చిందనే వార్త తెలిసిందని నటి నిత్యా మీనన్‌ చెప్పింది.

ఈ సందర్భంగా నిత్యామీనన్ చేసిన వాక్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

స్టార్ డైరెక్టర్ రాజమౌళికి ఊహించని తలనొప్పి.. జాగ్రత్త పడుతున్నా ఫలితం లేదుగా!