మా నాన్న ఇంట్లో చిన్న పూజ గది కూడా లేకుండా చేసాడు అంటూ కన్నీళ్లు పెట్టుకున్న నిత్యా మీనన్!

ఇండస్ట్రీ లో కొన్ని సిద్ధాంతాలను నమ్ముకొని, తమ చుట్టూ ఒక గీత గీసుకొని, ఆ గీత దాటకుండా తమకు నచ్చిన విధంగా సినిమాలు చేసిన హీరోయిన్స్ కొంతమంది మాత్రమే ఉన్నారు.

ఇలా తమకంటూ ప్రత్యేకమైన లిమిట్స్ ని పెట్టుకున్న హీరోయిన్లు ఇండస్ట్రీ లో సక్సెస్ కాలేకపోయారు.

ఎందుకంటే వీళ్ళు మిగిలిన హీరోయిన్స్ లాగ గ్లామర్ పాత్రలు చెయ్యరు.ముద్దు సన్నివేశాల్లో నటించరు, కానీ యాక్టింగ్ టాలెంట్ మాత్రం వేరే లెవెల్ లో ఉంటుంది.

ఆ నటనతోనే ఇండస్ట్రీ లో దశాబ్దం నుండి నెట్టుకొచ్చిన హీరోయిన్స్ ఉన్నారు.వారిలో ఒకరు నిత్యా మీనన్.

మలయాళం లో అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించిన తర్వాత, తెలుగు లో 'అలా మొదలైంది( Ala Modalaindi )' చిత్రం ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నిత్యా మీనన్( Nithya Menen ), తొలి సినిమాతోనే సూపర్ హిట్ ని అందుకుంది.

ఆ తర్వాత అవకాశాలు కోకొల్లలుగా వచ్చినా మనసుకి నచ్చిన పాత్రలను మాత్రమే చేస్తూ వచ్చింది.

"""/" / ఇదంతా పక్కన పెడితే నిత్యామీనన్ ఇంట్లో పద్ధతులు కూడా చాలా బిన్నంగా ఉంటాయి.

ఆమె తల్లితండ్రులు ఇద్దరు కూడా నాస్తికులు.చిన్నతనం నుండి నిత్యామీనన్ తన ఇంట్లో పూజ గదులు, దేవుడు విగ్రహాలు కూడా చూడలేదట.

ఈ విషయాన్నీ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె చెప్పుకొచ్చింది.

ఇంట్లో ఎవరి ప్రమేయం లేకపోయినా, అందరూ నాస్తికులు అయ్యినప్పటికీ కూడా, తన మనసు దేవుడిని పూజించడానికి మొగ్గు చూపించింది అట.

అలా తనకి తెలియకుండానే దైవత్వం ని నమ్మాను అని, ఇంట్లో వాళ్ళ ప్రభావం తన మీద పడలేదని చెప్పుకొచ్చింది.

ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

దేవుడి మీద ఎందుకు ఇంట్లో వాళ్లకు నమ్మకం లేదు అనే విషయం గురించి నిత్యా మీనన్ మాట్లాడలేదు కానీ, జీవితం లో జరిగే సంఘటనలు మన చేతుల్లో ఉండవని చెప్పుకొచ్చింది.

"""/" / గత ఏడాది వరకు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ గా గడిపిన నిత్యా మీనన్, ఈ ఏడాది మాత్రం కాస్త కెరీర్ కి బ్రేక్ ఇచ్చింది.

ఆమె చివరిసారిగా వెండితెర మీద కనిపించింది 'భీమ్లా నాయక్( Bheemla Nayak )' చిత్రం తో.

ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన నటించి మంచి మార్కులు కొట్టేసింది.

అతి తక్కువ టికెట్ రేట్స్ తో వంద కోట్ల రూపాయిల షేర్ వసూళ్లకు అతి దగ్గరగా వచ్చిన రెండు మూడు సినిమాలలో భీమ్లా నాయక్ కూడా ఒక్కటి.

ఈ సినిమా తర్వాత మలయాళం మరియు తమిళం లో పలు సినిమాలు చేసిన నిత్యా మీనన్, ఈ ఏడాది బ్రేక్ ఇచ్చింది.

కొబ్బరి పాలతో మీ కురులు అవుతాయి డబుల్.. ఎలా వాడాలంటే?