కరోనా దెబ్బకు నితిన్ పెళ్లి ఏమైందో తెలుసా?

యంగ్ హీరో నితిన్ నటించిన రీసెంట్ మూవీ భీష్మ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో నితిని అదిరిపోయే సక్సెస్‌ను అందుకున్నాడు.

ఇటు కెరీర్‌ పరంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా నితిన్ సక్సెస్ అవుతున్నాడు.

ఇప్పటికే నిశ్చితార్థం కూడా చేసుకున్న ఈ యంగ్ హీరో త్వరలో తన పెళ్లి కార్యక్రమాలు మొదలుపెట్టనున్నాడు.

దుబాయ్ దేశంలో అంగరంగ వైభవంవంగా వివాహమాడటానికి రెడీ అయ్యాడు నితిన్.ఏప్రిల్ 16న జరిగే వివాహానికి కరోనా అడ్డుగా మారింది.

కరోనా వైరస్ దెబ్బకు నితిన్ ఆలోచనలో పడ్డాడు.ఇప్పటికే ఇతర దేశాలకు ప్రయాణాలను నిలిపివేయడంతో నితిన్ పెళ్లి దుబాయ్‌లో జరగడం లేదు.

కాగా హైదరాబాద్‌లోని వధువు ఇంటి వద్దనే చాలా నిరాడంబరంగా, కొద్ది మంది సన్నిహితుల మధ్య వివాహం చేసుకునేందుకు నితిన్ రెడీ అయ్యాడు.

ఇలా కరోనా దెబ్బతో అనేక కార్యక్రమాలు రద్దవుతున్న సమయంలో నితిన్ పెళ్లి విషయంలో కూడా పెళ్లి జరిగే వేదికలో మార్పు రావడం ఏమంత ప్రత్యేక విషయం కాదని పలువురు అంటున్నారు.