ముద్దుగన్ను పేల్చిన ముద్దుగుమ్మతో నితిన్‌ రొమాన్స్‌

నితిన్‌ హీరోగా వచ్చిన శ్రీనివాస కళ్యాణం చిత్రం ప్రేక్షకులను నిరాశ పర్చింది.ఆ చిత్రంతో నితిన్‌ కూడా తీవ్రంగా నిరాశ పడ్డాడు.

ఆ సినిమా ఫలితం నుండి తేరుకునేందుకు చాలా సమయం పట్టింది.ఇంకా కూడా నితిన్‌ కొత్త సినిమాను పట్టాలెక్కించలేదు.

గత సంవత్సరంలోనే వెంకీ కుడుముల దర్శకత్వంలో 'భీష్మ' చిత్రం ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

ఎట్టకేలకు భీష్మకు అన్ని సిద్దం అయ్యింది.ఒక వైపు భీష్మ సినిమాకు సిద్దం అవుతూనే మరో వైపు చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయాలని నితిన్‌ ఫిక్స్‌ అయ్యాడు.

విభిన్నమైన చిత్రాల దర్శకుడిగా పేరునున్న దర్శకుడు చంద్ర శేఖర్‌ యేలేటి ప్రస్తుతం నితిన్‌ కోసం ఒక స్క్రిప్ట్‌ను సిద్దం చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియా వారియన్‌ను ఎంపిక చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

ప్రియా వారియర్‌ ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు లవర్స్‌ డే అనే చిత్రంతో పరిచయం అయ్యింది.

అయితే ఆ చిత్రం ఫ్లాప్‌ అయ్యింది.కాని ప్రియా వారియర్‌కు అప్పుడు వచ్చిన క్రేజ్‌ ఇంకా ఏమాత్రం తగ్గలేదు.

"""/"/ సోషల్‌ మీడియా సెన్షేషన్‌గా మారిన ప్రియా వారియర్‌ ఆమద్య తెలుగులో ఒక చిత్రంలో నటించే అవకాశం వచ్చినా కూడా కాదంది.

ఇప్పుడు నితిన్‌తో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది.ఈమె మలయాళంతో పాటు బాలీవుడ్‌ లో కూడా మంచి డిమాండ్‌ కలిగి ఉంది.

అయితే మొదటి సినిమా నిరాశ పర్చడంతో సినిమాల ఎంపిక విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తోంది.

మరి ఈ అమ్మడికి నితిన్‌తో రొమాన్స్‌ ఏ మేరకు కలిసి వస్తుంది, నితిన్‌కు ఆమెతో రొమాన్స్‌ ఏ విధంగా వర్కౌట్‌ అవుతుందో చూడాలి.

షాపింగ్ చేసే డిజార్డర్.. ఈ యువతి ఇంటి నిండా తెరవని బాక్సులు..?