సురేందర్ రెడ్డితో నితిన్ అలాంటి సినిమా
TeluguStop.com
యూత్ స్టార్ నితిన్ ప్రస్తుతం రెండు సినిమాలని రిలీజ్ కి బ్యాక్ టూ బ్యాక్ రెడీ చేశాడు.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే, అలాగే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చెక్ సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి.
మరో వైపు మేర్లపాక దర్శకత్వంలో అంధాదున్ రీమేక్ షూటింగ్ లో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు.
ఇక ఈ సినిమా తర్వాతh3 Class=subheader-style కృష్ణ చైతన్య/h3p దర్శకత్వంలో పవర్ పేట సిరీస్ ని స్టార్ట్ చేయబోతున్నాడు.
ఇలా ఈ ఏడాది కచ్చితంగా మూడు సినిమాలు నితిన్ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తాడు.
గత ఏడాది ఆరంభంలో భీష్మ సినిమాతో సాలిడ్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్న నితిన్ వరుసగా టాలెంటెడ్ దర్శకులతో సినిమాలని లైన్ లో పెట్టాడు.
ఇదిలా ఉంటే తనకి తీరని కలగా మిగిలిపోయిన మాస్ కమర్షియల్ హిట్ కచ్చితంగా కొట్టాలని కసితో నితిన్ ఉన్నాడు.
నితిన్ కెరియర్ లో మాస్ కమర్షియల్ మూవీ కోసం చేసిన ప్రయత్నం కారణంగా అతనికి 10 సినిమాల వరకు ఒక్క హిట్ పడలేదు.
మళ్ళీ జోనర్ మారిస్తే అప్పుడు హిట్ వచ్చింది. """/"/
ఇప్పుడు నితిన్ కమర్షియల్, మాస్ ఎంటర్టైనర్ చేయడం కోసం ఆ జోనర్ లో బెస్ట్ డైరెక్టర్ అయిన సురేందర్ రెడ్డితో జత కట్టడానికి రెడీ అవుతున్నాడు.
సురేందర్ రెడ్డి ప్రస్తుతం అఖిల్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోఒక సినిమా ఉంది.
ఈ రెండు సినిమాల తర్వాత అతన్ని లాక్ చేయాలని నితిన్ అనుకుంటున్నట్లు తెలుస్తుంది.
సురేందర్ రెడ్డి కూడా నితిన్ కోసం ఇప్పటికే ఒక స్టోరీ లైన్ రెడీ చేసినట్లు బోగట్టా.
అయితే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రావాలంటే కచ్చితంగా మరో రెండేళ్లు వేచి చూడాల్సిందే.
బన్నీ నువ్వు నా బంగారం.. వివాదంపై స్పందించిన రాజేంద్రప్రసాద్!