చరణ్ తో పోటీపడుతున్న రవితేజ, నితిన్... ఎందులోనో తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా పవర్ స్టార్ గా కొనసాగుతున్న రామ్ చరణ్.

తన సినిమాలతో మాస్ మహారాజ గా పేరు సంపాదించుకున్న రవితేజ కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన నితిన్ ఓకే బాటలో వెళ్తున్నారా అంటే ప్రస్తుతం టాలీవుడ్లో మాత్రం అవును అనే టాక్ కూడా వినిపిస్తోంది.

కారణం వీరు చేస్తున్న సినిమాలే.ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ హీరోగా రామారావు ఆన్ డ్యూటీ అనే పేరుతో ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇక ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపించబోతున్నాడట.ఇకపోతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సంచలన దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ లో నటిస్తున్నాడు.

ఈ సినిమాపై ఎన్ని అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాలో ప్రభుత్వ అధికారి అయిన ఎలక్షన్ కమిషనర్ కనిపించబోతున్నాడట రామ్ చరణ్.

ఇక అదే సమయంలో అటు యువ హీరో నితిన్ కూడా ఇదే బాటలో పయనిస్తున్నాడు అన్నది తెలుస్తుంది.

"""/" / మాచర్ల నియోజకవర్గం పేరు తో నితిన్ హీరోగా ఒక పొలిటికల్ డ్రామా రూపొందుతోంది.

ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా ఈ సినిమా తెరకెక్కుతు ఉండడం గమనార్హం.ఇకపోతే ఇలా ఒక వైపు రామ్ చరణ్ మరో వైపు రవితేజ ఇంకోవైపు నితిన్ లు ఇక తమ సినిమాల్లో ప్రభుత్వ అధికారులు పాత్రల్లోనూ నటిస్తూ ఉండడం గమనార్హం.

బాలీవుడ్ సినిమాలను మరోసారి డామినేట్ చేయాల్సిన సమయం వచ్చిందా..?