Nithiin Sreeleela : ఇంత చిన్నపిల్లలో ఇంత టాలెంటా.. శ్రీలీల గురించి షాకింగ్ సీక్రెట్స్ చెప్పేసిన నితిన్!
TeluguStop.com
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో హీరోయిన్ శ్రీలీల( Sreeleela ) పేరు కూడా ఒకటి.
ప్రస్తుతం వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలలో నటిస్తూ చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీబిజీగా గడుపుతోంది ఈ బ్యూటీ.
క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోంది ఈ ముద్దుగుమ్మ.అంతేకాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా రాణిస్తోంది.
ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు ఎంబిబిఎస్ కోర్సులు చేస్తోంది.ఇది ఇలా ఉంటే తాజాగా టాలీవుడ్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా నటించిన సినిమా ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్.
"""/" /
ఈ సినిమాలో హీరో రాజశేఖర్( Rajashekhar ) ముఖ్య పాత్ర చేయడం విశేషం.
సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 8న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.
ఇప్పటికే టీజర్, ట్రైలర్, పలు సాంగ్స్ రిలీజ్ చేయగా ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా హైదరాబాద్ లో ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హీరో నితిన్ మాట్లాడుతూ శ్రీ లీలీల లో ఉన్న మరిన్ని టాలెంట్ల గురించి బయట పెట్టేశాడు.
ఈ సందర్భంగా హీరో నితిన్( Nithiin ) మాట్లాడుతూ.నేను ఇప్పటికే చాలా సినిమాలు చేశాను.
నేను హీరో, డ్యాన్స్ వచ్చు నాకు అని మాములుగానే ఉంటుంది. """/" /
శ్రీలీల కూడా బాగా యాక్టింగ్ చేస్తుంది.
డ్యాన్స్ చేస్తుందని తెలుసు.డాక్టర్ చదువుతుందని తెలుసు.
షూటింగ్ మొదటి రోజే శ్రీలీల వచ్చింది.తన గురించి అడిగితే చెప్పింది.
తాను యాక్టింగ్, డ్యాన్స్, డాక్టర్ మాత్రమే కాదు స్విమ్మింగ్ లో స్టేట్ లెవెల్ లో ఆడింది.
హాకీ స్టేట్ లెవెల్ లో ఆడింది.తనకి కూచిపూడి, భారత నాట్యం కూడా వచ్చు.
ఇంకా వీణ కూడా వాయిస్తుంది.ఇంకా చాలా చెప్పింది.
నేను ఆ రోజు చాలు ఇంకా అనకపోతే ఇంకా తన ట్యాలెంట్స్ బయటపడేవి.
ఇంత చిన్న పిల్లలో ఇన్ని ట్యాలెంట్స్ అని ఆశ్చర్యపోయాను.ఈ సినిమాలో నేను ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ కానీ అసలు శ్రీలీల ఎక్స్‌ట్రా ఆర్డినరీ ఉమెన్ అని అంటూ అందరి ముందు శ్రీలపై ప్రశంసల వర్షం కురిపించాడు హీరో నితిన్.
నితిన్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో శ్రీ లీల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రియల్లీ శ్రీ లీల చాలా గ్రేట్ ఇంత చిన్న వయసులో అన్ని టాలెంట్స్ నా అని ఆశ్చర్యపోతున్నారు అభిమానులు.
పుష్ప3 ఐటమ్ సాంగ్ లో ఆ హీరోయిన్ కనిపించనున్నారా.. ఆమె ఓకే అంటారా?