భీష్మ టీజర్ టాక్: ఎంటర్‌టైనర్‌కు పక్కా కేరాఫ్

యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం భీష్మ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌తో సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేసిన చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేసింది.

ఈ టీజర్ చూస్తుంటే నితిన్ నుండి మరో సక్సెస్‌ఫుల్ మూవీ వస్తుందని అనుకోవచ్చు.

భీష్మ టీజర్‌ను పూర్తి ఎంటర్‌టైన్మెంట్ తరహాలో రూపొందించారు.టీజర్ మొదట్నుండీ చివరి వరకు ఎంటర్‌టైన్మెంట్‌కు ఎక్కడా కొదువ లేకుండా జాగ్రత్త పడ్డారు చిత్ర యూనిట్.

నితిన్ తనదైన మార్క్ కామెడీ టైమింగ్‌తో రెచ్చిపోయాడు.కాగా ఈ సినిమాలో అల్లరిచిల్లరిగా ఉండే నితిన్‌ పరిస్థితుల వల్ల ఎలా మారుతాడనేది సినిమాలో చూపించనున్నారు చిత్ర యూనిట్.

క్వాలిఫికేషన్ కంటే క్వాలిటీ ముఖ్యం అనే డైలాగుతో మొదలయ్యే ఈ టీజర్ ఆధ్యాంతం ఆకట్టుకుంది.

నితిన్ కామెడీతో పాటు రష్మికతో రొమాన్స్ అదరగొట్టాడు.సినిమాలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ వంటి కమెడియన్లతో పూర్తిస్థాయి కామెడీని పండించాడు దర్శకుడు వెంకీ కుడుముల.

ఇక సంపత్ రాజ్ సీరియస్ పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాతో నితిన్ మరోసారి అ ఆ లాంటి సినిమాను మనకు గుర్తు చేయడం ఖాయమని అంటున్నారు నితిన్ ఫ్యాన్స్.

ఏదేమైనా భీష్మ చిత్ర టీజర్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యింది.

ఈ సినిమాను ఫిబ్రవరి 21న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యారు.

భర్త క్షేమం కోసం సంచలన నిర్ణయం తీసుకున్న స్నేహ రెడ్డి..41 రోజులపాటు ఉపవాసం!