Varun Tej Lavanya Tripathi: లావణ్య వరుణ్ ల పెళ్లి డేట్ ఫిక్స్.. హాజరు కాబోతున్న సెలబ్రిటీ జంటలు వీరే?

టాలీవుడ్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి( Varun Tej ) ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే.

కొంత కొంతకాలంగా రిలేషన్షిప్ లో ఉన్న ఈ జంట ఆ విషయాన్ని బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతూ ఒకేసారి ఎంగేజ్మెంట్ వేడుకను జరుపుకునే షాక్ ఇచ్చారు.

ఇది ఇలా ఉంటే ఈ జంట ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత నుంచి ఈ జంట ఎప్పుడెప్పుడు మూడుముళ్ల బంధంతో ఒకటి అవుతారా అని అటు లావణ్య అభిమానులు ఇటు మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

దీంతో వరుణ్ తేజ్ లావణ్యలకు ఎక్కడికి వెళ్లినా కూడా వారికి పెళ్లికి సంబంధించిన విషయాలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

"""/" / ఇప్పటికే పెళ్లి తేదీపై చాలా ఇంటర్వ్యూల్లో వరుణ్‌పై ప్రశ్నల వర్షం కురుస్తోంది.

పెళ్లి తేదీ ఇంకెప్పుడు ప్రకటిస్తారంటూ ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది.ఇప్పటికే మెగా ఫ్యామిలీ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే పెళ్లి తేదీని అమ్మ నిర్ణయిస్తుందని ఇటీవల ఒక ఇంటరాక్షన్‌ సందర్భంగా వరుణ్ తేజ్ వెల్లడించారు.

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ ఏడాది నవంబర్ నెలలో వరుణ్-లావణ్య( Lavanya Tripathi ) వివాహాం జరిగేలా కనిపిస్తోంది.

అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రస్తుతం జరుగుతున్నాయని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.అయితే ఇప్పుడు వేదికతో పాటు ఈ పెళ్లికి హాజరయ్యే ప్రముఖుల ఎవరనే అంశంపై చర్చ నడుస్తోంది.

"""/" / వరుణ్, లావణ్యకు ఇండస్ట్రీలో ప్రముఖ నటీనటులు, స్నేహితులు చాలామందే ఉన్నారు.

అయితే వీరి పెళ్లి ఇటలీలో జరుగుతుందని ఇప్పటికే ఊహగానాలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ముఖ్య అతిథుల లిస్ట్‌లో హీరో నితిన్, ఆయన భార్య షాలి( Nithiin )ని కూడా ఉన్నట్లు సమాచారం.

ఈ పెళ్లిలో అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్‌తో పాటు ఇతర నటీనటులు సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇప్పటికే ప్రముఖుల గెస్ట్ లిస్ట్ గురించి మరిన్నీ ఊహాగానాలు వస్తున్నాయి.అయితే ఇప్పటికే మెగా ఫ్యామిలీ పెళ్లి వేదికతో పాటు తేదీ కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది.

వరుణ్ పెళ్లికి సంబంధించి సన్నాహాలు మొదలు పెట్టినట్లు సమాచారం.

ఇండియనే మొగుడుగా కావాలంట.. ఈ అమెరికన్ మహిళ వీడియో చూస్తే..