Extra-Ordinary Man : ”ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” ట్విట్టర్ రివ్యూ.. ఎలా ఉందంటే.. నితిన్ హిట్ కొట్టేనా?

యూత్ స్టార్ నితిన్( Nithiin ) వరుసగా ప్రాజెక్టులను ప్రకటిస్తూ తన కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

ఎన్ని ప్లాప్స్ వస్తున్నప్పటికీ ఈయన లైనప్ లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి.మరి ప్రజెంట్ ఈయన చేస్తున్న ప్రాజెక్టుల్లో 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్'' ఒకటి.

"""/" / ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.ఇప్పటికే ప్రీమియర్స్ పడడంతో సినిమాను వీక్షించిన వారంతా ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

దీంతో ప్రేక్షకులు ఈ సినిమా విషయంలో ఎలాంటి రివ్యూలు ఇచ్చారో చూద్దాం.ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా( Extra-Ordinary Man )కు వచ్చిన రివ్యూలు ఏంటంటే.

/br> """/" / ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాను వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తుండగా శ్రేష్ట్ మూవీస్ ఎల్ ఎల్ పి మరియు రుచిర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు.

ఇక ఇందులో నితిన్ కు జోడీగా శ్రీలీల హీరోయిన్ గా నటించగా మంచి ప్రమోషన్స్ తో ఈ రోజు డిసెంబర్ 8న బరిలోకి దిగింది.

ఈ సినిమా ప్రీమియర్స్ చుసిన వారు సినిమాలో కామెడీ బాగుంది అని.ముఖ్యంగా రావు రమేష్, నితిన్ కాంబోలో కామెడీ సీన్స్ అదుర్స్ అంటూ తమ రివ్యూలను ఇచ్చారు.

అలాగే ఈ మధ్య నితిన్ నుండి వచ్చిన సినిమాల్లో ఇదే బెస్ట్ కామెడీ అండ్ లవ్ డ్రామా అని చెప్పుకొస్తున్నారు.

మరి ఈ ఫ్యామిలీ డ్రామాను మంచి ఎంటర్టైనర్ గా తెరకెక్కించగా ఆడియెన్స్ ను ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

కల్కి కామియో రోల్స్ మీద కామెంట్స్ చేస్తున్న ప్రేక్షకులు… కారణం ఏంటి..?