జగన్ పరిపాలనను పొగడ్తలతో ముంచెత్తిన నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్..!!

నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ తాజాగా సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు.

అధికారులతో నిర్వహించిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పరిపాలన అద్భుతంగా ఉందని ప్రశంసల వర్షం కురిపించారు.

జగన్ తీసుకున్న నిర్ణయాలు రిమార్క్ బుల్ అని కొనియాడారు.డిజిటల్ లైబ్రరీ,  రైతు భరోసా కేంద్రాలు.

మహిళల భద్రత విషయంలో దిశా యాప్ వంటివి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు చేయని రీతిలో వినూత్న ఆలోచనలతో.

ఏపీలో పరిపాలన ఉందని పేర్కొన్నారు.ఇదే సమయంలో కరోనా వలన అనాధలైన పిల్లలకు 10 లక్షల రూపాయలు ఫిక్సడ్ డిపాజిట్ చేయడం అద్భుతం అని కొనియాడారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న కొన్ని కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలలో కూడా అమలయ్యేలా.ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచిస్తాము అని స్పష్టం చేశారు.

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పరిపాలన అమలవుతున్న కార్యక్రమాలను బట్టి చూస్తే రాబోయే రోజుల్లో దేశంలో కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్ర స్థానంలో ఉంటుందని, అంతటి సామర్ధ్యం దిశగా.

జగన్ పరిపాలన అందిస్తున్నారు అంటూ నీతి అయోగ్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ ప్రశంసల వర్షం కురిపించారు.

పెరుగులో ఉప్పు కలుపుకోవాలా.. లేక పంచదార కలుపుకోవాలో తెలుసా..?