లోకల్ ఛానెల్‌కు రీసౌండ్ వినిపించేలా చేసిన నిశ్శబ్ధం

టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి నటించిన లేటెస్ట్ మూవీ ‘నిశ్శబ్ధం’ అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా ఎప్పుడో థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉన్నా, కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూతపడటంతో ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

కోన వెంకట్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాను పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా చిత్ర యూనిట్ తీర్చిదిద్దింది.

అయితే ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడంతో చిత్ర యూనిట్ నిరాశకు లోనయ్యారు.

అయితే తాజాగా నిశ్శబ్ధం చిత్ర యూనిట్‌కు హైదరాబాద్‌కు చెందిన ఓ లోకల్ ఛానల్ చుక్కలు చూపించింది.

ఇటీవల నిశ్శబ్ధం చిత్రం ఓటీటీలో రిలీజ్ కావడంతో ఈ సినిమాను హైదరాబాద్‌కు చెందిన ఓ లోకల్ ఛానల్ టెలికాస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది.

దీంతో ఈ విషయం నిశ్శబ్ధం చిత్ర యూనిట్ సభ్యులకు తెలిసింది.వారు వెంటనే సదరు ఛానల్‌పై దావా వేసింది.

తమ సినిమాను ఎలాంటి పర్మిషన్ లేకుండా సదరు ఛానల్‌లో ఎలా ప్రసారం చేస్తారని వారిపై మండిపడింది.

దీంతో సదరు టీవీ ఛానల్ తమకు రూ.1.

1 కోట్లు చెల్లించేలా నిశ్శబ్ధం చిత్ర యూనిట్ లీగల్ నోటీసులు పంపించింది.అంతేగాక ఈ సినిమా రైట్స్‌ను సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ కూడా సదరు ఛానల్‌పై రూ.

30 లక్షల దావా వేసింది.దీంతో ఆ లోకల్ ఛానల్‌కు గూబ గుయ్యిమంది అని సినీ వర్గాలు అంటున్నాయి.

ఏదేమైనా ఒక స్టార్ క్యాస్టింగ్ ఉన్న సినిమాను లోకల్ ఛానల్‌లో చడీ చప్పుడు కాకుండా టెలికాస్ట్ చేస్తుంటే, ఈ ఛానల్ వారు ముందు హడావుడి చేయాలని భావించి క్షవరం చేయించుకోవాల్సి వచ్చింది.

ఇకనైనా లోకల్ ఛానళ్లు ఈ విషయంపై క్లారిటీగా ఉంటారో లేదో చూడాలి అంటున్నారు సినీ విశ్లేషకులు.

గేమ్ ఛేంజర్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో అతనేనా.. అందుకే రిజెక్ట్ చేశారా?