నిశ్శబ్ధం మళ్లీ సౌండ్ లేదుగా!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి నటిస్తున్న తాజా చిత్రం నిశ్శబ్ధం ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రెడీగా ఉంది.

అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో ఏదో ఒక కారణంతో సినిమా వరుసగా వాయిదా పడుతూ వస్తోంది.

తొలుత జనవరిలో రిలీజ్ చేద్దామనుకున్న చిత్ర యూనిట్, ఫిబ్రవరిలో రిలీజ్‌కు రెడీ అయ్యింది.

కానీ ఇప్పుడు ఫిబ్రవరిలో కూడా ఈ సినిమా రిలీజ్‌ అయ్యేలా కనిపించడం లేదు.

సినిమాకు బజ్ లేకపోవడంతో బయ్యర్లు ఈ సినిమాను కొనేందుకు ముందుకు రావడం లేదట.

పాన్ ఇండియా సినిమాగా నిశ్శబ్ధం చిత్రం తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

దీంతో ఈ సినిమాను ఫిబ్రవరికి బదులుగా వేసవిలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు చిత్ర యూనిట్.

ఈ క్రమంలో నిశ్శబ్ధం సినిమాను ఏప్రిల్ 2న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతున్నారు.

దీంతో స్వీటీ ఫ్యాన్స్ నిశ్శబ్ధం సినిమా కోసం ఆతృతగా చూస్తుంటే, వారి ఆశలపై చిత్ర యూనిట్ నీళ్లు చల్లినట్లయ్యింది.

మరి ఈ సినిమా ఏప్రిల్‌లోనైనా రిలీజ్ అవుతుందా లేదా అనేది చూడాలి.ఈ సినిమాను హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేస్తుండగా కోన వెంకట్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

ఒత్తైన జుట్టు కోసం ఆరాట‌పడుతున్న పురుషుల‌కు బెస్ట్ ఆయిల్ ఇది..!