కోపంగా ఉన్నప్పుడు వంటలక్క వేషాలు.. డాక్టర్ బాబు సెటైర్స్!

బుల్లితెరలో కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను ఎంతలా వాలిపోయేలా చేసిందో చూస్తూనే ఉన్నాం.అందులో నటించే ప్రతి ఒక్కరి పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

ఇక ఇందులో డాక్టర్ బాబుగా నిరుపమ్ పరిటాల, వంటలక్క గా ప్రేమి విశ్వనాథ్ మాత్రం ఓ రేంజ్ లో ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

ఇక వీరిద్దరూ సీరియల్ లో ఎప్పుడెప్పుడు కలుస్తారా అని తెగ ఎదురు చూస్తుంటారు ప్రేక్షకులు.

ఇక వీళ్ళు సీరియల్ పాత్ర వరకే అలా ఉంటారు కానీ బయట మాత్రం ఎంతో ఫ్రెండ్లీ గా కనిపిస్తుంటారు.

ఇక నిరుపమ్ బుల్లితెరలో స్టార్ హీరోగా నిలిచాడు.అంతేకాకుండా హిట్లర్ గారి పెళ్ళాం అనే మరో సీరియల్ లో కూడా బాగా బిజీగా ఉన్నాడు.

ఇవే కాకుండా మరిన్ని అవకాశాలు రావడంతో డేట్స్ కుదరక పోవడం వల్ల వాటికి నో చెప్పేస్తున్నాడు.

ఇక ఈయన సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటాడు.ప్రతి ఒక్క విషయాన్ని బాగా స్పందిస్తుంటాడు.

ఇక ఈయన మీద నెటిజన్లు చేసే ట్రోలింగ్స్ కు బాగా స్పందిస్తుంటాడు.అంతేకాకుండా అప్పుడప్పుడు ఫన్నీ కామెంట్స్ కూడా చేస్తుంటాడు నిరుపమ్.

ఇదిలా ఉంటే తాను కోపంగా ఉన్నప్పుడు వంటలక్క వేషాలు అంటూ ఒక కామెంట్ చేశాడు.

"""/"/ నిజానికి కార్తీక్, దీప లు ఖాళీ సమయంలో వీడియోలు, ఫోటోలు తీసుకుంటారు.

అంతేకాకుండా వీరిద్దరు జంటగా కలిసి బుల్లితెరలో పలు ఎంటర్టైన్మెంట్ షోలలో కూడా గెస్ట్ గా పాల్గొంటారు.

ఇదిలా ఉంటే తాజాగా డాక్టర్ బాబు తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ ఫోటో షేర్ చేసుకున్నాడు.

అందులో ఎల్లో షర్ట్ వేసుకొని బుంగమూతి పెట్టుకుంటూ ఫోటోకి ఫోజ్ ఇచ్చాడు.ఇక ఈ ఫోటోకు ఓ కామెంటు ఇచ్చాడు డాక్టర్ బాబు.

ఆదివారం కూడా షూటింగ్ ఉండటంతో కోపంగా ఉన్నాను అంటూ ఇక ఆ సమయంలో వంటలక్క ఫోటో తీయగా వంటలక్క ఫోటోలక్కగా మారుతుందేమో అని సెటైర్ వేసాడు.

ప్రస్తుతం డాక్టర్ బాబు చేసిన సెటైర్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

హే ప్రభూ.. ఏంటి ఈ విడ్డురం.. బస్సు అనుకుంటే పొరపాటే సుమీ..