కామారెడ్డి జిల్లా కలెక్టర్ పై నిర్మలా సీతారామన్ ఆగ్రహం
TeluguStop.com
కామారెడ్డి జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన కొనసాగుతుంది.
దీనిలో భాగంగా బాన్సువాడ నియోజకవర్గంలోని బిక్నూర్ లో రేషన్ షాపును ఆమె సందర్శించారు.
ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ పటేల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉచిత రేషన్ బియ్యంలో కేంద్ర వాటా ఎంత.?, రాష్ట్రం వాటా ఎంత.
? అని కలెక్టర్ ను నిర్మల ప్రశ్నించారు.కలెక్టర్ సరైన సమాధానం చెప్పలేకపోవడంతో ఫైర్ అయిన నిర్మలా సీతారామన్.
ఆన్సర్ చేసేందుకు అరగంట సమయం ఇచ్చి తెలుసుకుని చెప్పాలని ఆదేశించారు.అనంతరం, రేషన్ షాపు వద్ద ఫ్లెక్సీలో ప్రధాని మోదీ ఫొటో లేకపోవడంపై నిర్మలా సీతారామన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యాన్ని ఇస్తోందని.ప్రధాని ఫొటోను ఎందుకు ఉంచలేదని మండిపడ్డారు.