నిరవధిక దీక్షకు కూర్చున్న నిమ్స్ కాంట్రాక్టు నర్సులు..

తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని, నిమ్స్ ఉద్యోగులతో సరి సమానంగా జీతభత్యాలను పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీసం మెటర్నిటీ లీవులు కూడా లేవని, పే కోరుతూ నిమ్స్ లో పని చేస్తున్న నర్స్ లు గత వారం రోజులుగా నిరవధిక దీక్షలో కూర్చున్నారు.

నిమ్స్ ప్రధాన గేట్ ముందు జరిగిన కాంట్రాక్టు నర్సుల దీక్షకు మద్దతు తెలిపిన నిమ్స్ రెగ్యులర్ నిమ్స్ నర్సుల యూనియన్(ఎన్ ఎన్ యు) అధ్యక్షురాలు ఆశాలత మాట్లాడుతూ నిమ్స్ లో పేషేంట్ల తాకిడి ఎక్కువగా ఉన్న నర్స్ లు మాత్రం తక్కువ సంఖ్యలో ఉన్నారని, గత 12 ఏళ్లుగా పనిచేస్తున్న వారు ఇంకా కాంట్రాక్టు ఉద్యోగులు గానే ఉన్నారని, కాంట్రాక్టు నర్స్ లను తక్షణమే పర్మినెంట్ చేయాలని కోవిడ్ సమయంలో సైతం విధులు నిర్వర్తించిన నర్స్ లకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కు విజ్ఞప్తి చేశారు.

వైరల్ వీడియో: పోలీసు స్టేషన్‌లోనే మహిళతో రాసలీలలు చేసిన పోలీస్ అధికారి