2వేల పడకలతో నిమ్స్ నూతన భవనం

2వేల పడకలతో నిమ్స్ నూతన భవనం హైదరాబాద్ : నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) ఆసుపత్రి విస్తరణలో భాగంగా నిర్మించబోతున్న 2వేల పడకల నూతన భవనానికి త్వరలో ముఖ్యమంత్రి కెసిఆర్ భూమి పూజ చేస్తారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు వెల్లడించారు.

మంగళవారం సచివాలయంలో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి తొలిసారి సమీక్ష నిర్వహించారు.ఈ మేరకు త్వరగా అన్ని ఏర్పాట్లు చేయాలని, అవసరమైన అన్ని విభాగాల అనుమతులు పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ నూతన భవనంలో ఓపి, ఐపి, ఎమర్జెన్సీ సేవల కు ప్రత్యేకంగా బ్లాకులు ఉంటాయన్నారు.

భవనం మొ త్తం ఎనిమిది అంతస్తులుగా ఉంటుందని చెప్పారు.ప్రస్తుతం నిమ్స్‌లో 1500 పడకలు ఉన్నాయని, నూతన భవనం పూర్తయితే పడకల సంఖ్య 3,500కు చేరుతుందన్నారు.

ఇటీవల భూమిపూజ చేసుకున్న సూపర్ స్పెషాలిటీ ఎంసిహెచ్ కూడా పూర్తయితే మరో 200 పడకలు అదనంగా అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

తద్వా రా ఒక నిమ్స్‌లోనే 3,700 పడకలు ఉంటాయని .నిమ్స్ ఎంసిహెచ్ పనులు వేగవంతం చేయాలన్నారు.

పెరుగుతున్న జనాభా, అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ నలువైపులా ఒక్కొక్కటి వెయ్యి పడకలు కలిగి ఉండే టిమ్స్.

కృష్ణయ్య రాజీనామా ఎందుకు చేశారు ? వీటికి సమాధానం ఏది?