నిమ్మకాయ దీపం వెలిగించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసా..!

సాధారణంగా మనం ఏదైనా దేవాలయాలను దర్శించినప్పుడు అక్కడ కొందరు నిమ్మకాయలలో దీపారాధన చేయడం మనం చూస్తూనే ఉంటాం.

అయితే నిమ్మకాయ పై దీపం వెలిగించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? ఎందుకు నిమ్మకాయ దీపాన్ని వెలిగిస్తారు? అనే విషయాలు చాలా మందికి తెలియక పోవచ్చు.

అయితే ఈ నిమ్మకాయ దీపాలను ఎందుకు వెలిగిస్తారో,దీపాలను వెలిగించేటప్పుడు ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.

సాధారణంగా దేవాలయాల్లో నిమ్మకాయ దీపం వెలిగించేది కుజదోషం, కాలసర్ప దోషాలు, వ్యాపారం,కుటుంబ ఆర్థిక పరిస్థితులతో సతమతమయ్యేవారు దేవాలయాలలో ఈ దోషాలు తొలగిపోవాలని దేవుడికి నిమ్మకాయ దీపం వెలిగించి పూజిస్తారు.

ఈ నిమ్మకాయ దీపారాధన చేయడం వల్ల శక్తిస్వరూపిణి అయిన అమ్మవారు అనుగ్రహించి మనకున్న ఈతిబాధల నుంచి విముక్తి కలిగిస్తుంది.

శక్తి స్వరూపిణి అయిన పార్వతి దేవికి నిమ్మకాయల అంటే ఎంతో ఇష్టం.అదేవిధంగా నిమ్మకాయలను గ్రామ దేవతలైన పెద్దమ్మ, ఎల్లమ్మ దేవతలకు మాలగా సమర్పిస్తారు.

"""/"/ ఈ నిమ్మకాయల దీపాలను కూడా గ్రామదేవతల ఆలయంలో మాత్రమే వెలిగించాలి.పొరపాటున మహాలక్ష్మి, సరస్వతి ఇతర దేవాలయాల్లో ఈ దీపాలను వెలిగించకూడదు.

పార్వతి దేవి ఆలయంలో నిమ్మకాయలను వెలిగించేవారు శుక్ర ,మంగళవారాల్లో రాహు కేతు సమయంలో వెలిగించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు.

ముఖ్యంగా శుక్రవారం ఈ దీపాలను వెలిగించి పెరుగన్నం, పెసరపప్పు, పానకం వంటి నైవేద్యాలతో సమర్పించి పూజ చేయాలి.

ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించే టప్పుడు కేవలం ఆకుపచ్చరంగులో ఉన్నటువంటి నిమ్మకాయలను మాత్రమే తీసుకోవాలి.

అదే విధంగా ఎటువంటి మచ్చలు లేకుండా ఉండాలి.పుట్టిన రోజు, పెళ్లి రోజులలో నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు.

నిమ్మకాయ దీపాన్ని వెలిగించే సమయంలో నేలపై ఉంచకూడదు దీపం కింద ఆకు లేదా ధాన్యాలను వేసి వెలిగించాలి.

ఈవిధంగా నిమ్మకాయ దీపాలను వెలిగించే టప్పుడు ఈ నియమాలను పాటించడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా కుజ,కాల సర్ప దోషాలు సైతం తొలగిపోతాయి.

CM Jagan : విశాఖ డ్రగ్స్ వ్యవహారంపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!