Nikki Tamboli : బిగ్ బాస్ బ్యూటీపై దారుణంగా ట్రోల్స్.. అవేం కొత్త కాదంటున్న నటి?

బాలీవుడ్ హీరోయిన్ నిక్కీ తంబోలి( Nikki Tamboli ) గురించి మనందరికీ తెలిసిందే.

హిందీ బిగ్ బాస్ సీజన్ 14 లో పాల్గొని రన్న రప్ గా నిలిచిన విషయం తేలిసిందే.

బిగ్ బాస్ షోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె మరింత పాపులారిటీని సంపాదించుకుంది.

అంతేకాకుండా ఈ షో ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నిక్కీ తంబోలీ ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి మంచి ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది.

కాగా ఈమె చీకటి గదిలో చితక్కొట్టుడు అనే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత కాంచన 3 మూవీ ద్వారా కోలీవుడ్‌ లోకి ప్రవేశించింది. """/" / ఆ తర్వాత టాలీవుడ్‌లో తిప్పరా మీసం, అంటే సుందరానికి అనే చిత్రాల్లో కనిపించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఆమె షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో( Social Media ) వైరల్‌గా మారింది.

అది చూసిన నెటిజన్స్ ఆమెపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.కొందరైతే ఏకంగా పోర్న్ స్టార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆమె తనపై ట్రోల్స్‌పై స్పందించింది.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హాజరైన నిక్కీ సోషల్ మీడియాలో ట్రోల్స్ తనకేమీ కొత్త కాదని చెబుతోంది భామ.

సోషల్ మీడియాలో తనపై వస్తున్న కామెంట్లను ఉద్దేశించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. """/" / ఈ సందర్బంగా నిక్కీ తంబోలి మాట్లాడుతూ.

మీరు నన్ను ఏలాగైనా పిలవండి.కానీ అవీ ఏ విధంగానూ నా స్థిరత్వ భావనను దెబ్బ తీయలేవు.

సోషల్ మీడియాలో ట్రోల్ కోసమే సమయాన్ని వెచ్చించడమే పనిగా పెట్టుకున్న వ్యక్తుల ధ్రువీకరణ కోసం నేను ఇక్కడికి రాలేదు.

నాతో పాటు మరెవరినైనా అడల్ట్ ఫిల్మ్ స్టార్‌తో( Adult Star ) పోల్చడమంటే మహిళలను అవమానించడమే కదా.

కారణం లేకుండా మరో స్త్రీని కించపరచడం ఎందుకు? ఇలాంటి చిత్రాలను కేవలం కామం కళ్లతో ఆస్వాదించే భయంకరమైన వ్యక్తులంతా మీరే కదా? అడల్ట్ ఫిల్మ్ స్టార్ అయినప్పటికీ మానవతా విషయానికొస్తే గౌరవానికి అర్హులే కదా.

మనం ఎంత స్పందిస్తే మనపై ఇంకా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తారు.అందుకే వాటిని పట్టించుకోను.

ఏదో ఒకరోజు వారే విసుగు చెంది కామెంట్స్ చేయడం మానేస్తారు.అంతే తప్ప అవీ నా జీవితాన్ని ఎలాంటి ప్రభావితం చేయలేవు అని చెప్పుకొచ్చింది నిక్కీ.

ఇదేం పెళ్లి గోల రా బాబు.. భారతీయులపై కెనడా యువతి తిట్లు వింటే నవ్వాగదు!