Donald Trump : వెనుక కాదు.. ముందుకొచ్చి మాట్లాడు : డొనాల్డ్ ట్రంప్‌కు నిక్కీ హేలీ సవాల్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నామినేషన్ కోసం తలపడుతున్న డొనాల్డ్ ట్రంప్( Donald Trump ), భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ( Nikki Haley ) మధ్య ప్రస్తుతం మాటల యుద్ధం నడుస్తోంది.

రిపబ్లికన్ పార్టీలో ప్రస్తుతం వీరిద్దరే పోటీలో మిగిలారు.ఈ క్రమంలో తన భర్తపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు నిక్కీ గట్టి కౌంటరిచ్చారు.

వెనుక వైపు మాటలు కాకుండా నేరుగా చర్చకు రావాలని నిక్కీ హేలీ సవాల్ విసిరారు.

‘‘ మైఖేల్ (నిక్కీ భర్త) మనదేశానికి సేవ చేస్తున్నాడు.ఇది నీకు తెలియని విషయం, డొనాల్డ్.

నీకు ఏదైనా చెప్పాలని వుంటే నా వెనుక చెప్పకు, చర్చా వేదికపైకి వచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడండి ’’ అంటూ ఆమె ఓ ప్రచార కార్యక్రమంలో అన్నారు.

మరో ప్రకటనలో నిక్కీ హేలీ ఇలా అన్నారు.‘‘ మీరు ఓ పోరాట యోధుడి సేవను అపహాస్యం చేస్తే.

మీరు డ్రైవింగ్ లైసెన్స్‌కు అర్హులు కాదు, యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిగా వుండకూడదు ’’ అంటూ పేర్కొన్నారు.

"""/" / శనివారం నిక్కీ హేలీ స్వస్థలమైన సౌత్ కరోలినాలో ( South Carolina )ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్.

ఆమె (హేలీ) భర్తకు ఏమైంది.అతను ఎక్కడ.

? ఆయన వెళ్లిపోయాడు అంటూ వ్యాఖ్యానించారు.ఆ వెంటనే నిక్కీ హేలీ మాట్లాడుతూ.

డోనాల్డ్ ట్రంప్ ఇవాళ సౌత్ కరోలినాలో ర్యాలీ నిర్వహించారని, ఈ సందర్భంగా ఆయన తన భర్త సైనిక సేవను ఎగతాళి చేశాడని మండిపడ్డారు.

నా భర్త మైఖేల్ మనదేశానికి సేవ చేస్తున్నాడు.ఆయన సేవకు తానెంతో గర్వపడుతున్నానని, ఇది కుటుంబ త్యాగమని ప్రతి సైనిక జీవిత భాగస్వామికి తెలుసునని నిక్కీ హేలీ వ్యాఖ్యానించారు.

దళాలకు మద్ధతు ఇచ్చే, సైనిక కుటుంబాలు చేసే త్యాగాలను అర్ధం చేసుకునే కమాండర్ ఇన్ చీఫ్‌ని ఎన్నుకోవాలని ఆమె తన మద్ధతుదారులకు పిలుపునిచ్చారు.

"""/" / కాగా.ఇప్పటికే నెవాడా ఓటర్లు నిక్కీకి షాకిచ్చారు.

రిపబ్లికన్ అభ్యర్ధిత్వం కోసం జరిగిన ప్రైమరీలో నిక్కీహేలీకి ప్రత్యర్ధులు ఎవరూ లేకపోయినా ఓటర్లు ఆమెను తిరస్కరించారు.

నిక్కీకి ఓటు వేయకుండా ‘None Of These Candidates' (భారతదేశంలో నోటా లాంటిది ) బటన్ నొక్కారు.

నిక్కీ హేలీకి 32 శాతం ఓట్లు రాగా.నన్ ఆఫ్ దీజ్ కాండిడేట్స్‌కు అత్యధికంగా 61 శాతం ఓట్లు పోలై ఆమె ఓడిపోయారు.

ఇది అమెరికా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.నెవడా రాష్ట్రంలో ఫిబ్రవరి 6న డెమొక్రాటిక్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిత్వాల కోసం ప్రైమరీలు జరగాయి.

డెమొక్రాట్ పార్టీలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ విజయం సాధించగా.రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు పోటీ చేయలేదు.

నిక్కీ ఒక్కరే పోటీ చేశారు.కానీ ఆమెకు ఓటర్లు ఎవ్వరూ ఊహించని విధంగా షాకిచ్చారు.

రేవంత్ రెడ్డి దూకుడుకి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ … ఇక ఆపేదెవరు