Nikki Haley : అమెరికా అధ్యక్ష ఎన్నికలు : రిపబ్లికన్ ప్రైమరీలో నిక్కీ హేలీకి మరో ఓటమి .. మిచిగన్‌పైనే ఆశలు

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిత్వం కోసం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది.

తాజాగా సౌత్ కరోలినా రిపబ్లికన్ ప్రైమరీలో ట్రంప్ చేతిలో నిక్కీ హేలీ ఓటమి పాలయ్యారు.

ఈ పరాజయం ఆమె విజయావకాశాలను తీవ్రంగా దెబ్బతీసింది.జనవరిలో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్( Ron DeSantis ) తప్పుకున్న తర్వాత ట్రంప్‌ను వ్యతిరేకించిన చివరి ప్రధాన అభ్యర్ధి హేలీ.

ట్రంప్ విభజనవాదం, విధానాలు, జనవరి 6 నాటి కాపిటల్ అల్లర్లు, కోర్టుల్లో కేసుల నేపథ్యంలో తనకు మద్ధతుగా నిలవాలని నిక్కీ హేలీ స్వతంత్ర ఓటర్లకు విజ్ఞప్తి చేసింది.

"""/" / హేలీ తన వంతుగా.ఎప్పుడైనా రేసు నుంచి తప్పుకుంటానన్న సంకేతాలను మాత్రం ఇవ్వలేదు.

తన మద్ధతుదారులకు పంపిన ఈమెయిల్‌లో ఫైట్ గోస్ ఆన్( Fight Goes On ) అనే సబ్జెక్ట్ లైన్‌తో , ఆమె తన ప్రచారానికి గర్వపడుతున్నానని .

వాలంటీర్లకు, దాతలకు, ధన్యవాదాలు తెలిపింది.సౌత్ కరోలినా ఫలితాలతో తాను నిరుత్సాహపడలేదని దేశం కోసం సానుకూలమైన , ఆశాజనకమైన విధానాలను అందిస్తూనే వుంటానని నిక్కీ హేలీ పేర్కొన్నారు.

"""/" / మొత్తంగా నిక్కీ హేలీ.న్యూహాంప్‌షైర్ ప్రైమరీలో మంచి ప్రదర్శన కనబరిచారు.

అక్కడ ఆమె 17 మంది డెలిగేట్‌లను గెలుచుకుంది.కానీ ఈ దూకుడును కొనసాగించడంలో మాత్రం విఫలమైంది.

2011 నుంచి 2017 వరకు నిక్కీ హేలీ గవర్నర్‌గా పనిచేసిన సౌత్ కరోలినాను ఆమెకు కంచుకోటగా విశ్లేషకులు భావించారు.

కానీ తాజా ప్రైమరీలో ట్రంప్‌కు 58 శాతం, నిక్కీ హేలీకి 32 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి.

సౌత్ కరోలినా( South Carolina ) రిపబ్లికన్ డెలిగేట్‌లు ప్రైమరీ తర్వాత నిర్దిష్ట అభ్యర్ధికి కట్టుబడి వుండరు.

అంటే హేలీ ఇప్పటికీ వారిలో కొందరిని తమ వైపుకు మారేలా ఒప్పించేందుకు ప్రయత్నించవచ్చు.

ఏది ఏమైనప్పటికీ, ప్రతినిధుల గణనలో ట్రంప్ (293) ఆధిక్యంలో వుండగా.హేలీకి (49) మంది మాత్రమే డెలిగేట్‌లు వున్నారు.

ఇకపోతే .నిక్కీ హేలీ( Nikki Haley )కి తదుపరి పెద్ద పరీక్ష సూపర్ ట్యూస్‌డే.

మార్చి 5న 16 రాష్ట్రాలు, భూభాగాలు తమ ప్రైమరీలు, కాకస్‌లను నిర్వహిస్తాయి.874 మంది డెలిగేట్‌లను లేదా మొత్తంలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మందిని ఈ రాష్ట్రాలు కలిగివున్నాయి.

హేలీ తన విజయావశాలను మెరుగుపరచుకోవాలంటే ఈ డెలిగేట్‌లలో అధిక వాటాను గెలుచుకోవాల్సి వుంటుంది.

అయితే చాలా రాష్ట్రాలలో ట్రంప్ కంటే ఆమె వెనుకబడి వుంది.

దయచేసి అల్లు అర్జున్ తో నన్ను పోల్చవద్దు… బిగ్ షాక్ ఇచ్చిన అమితాబ్ బచ్చన్!