యూఎస్ ఓపెనింగ్స్ తో కుమ్మేసిన నిఖిల్.. స్పై కూడా ఆ లిస్టులోకి చేరుతుందా?
TeluguStop.com
ఎట్టకేలకు ఈ రోజు రిలీజ్ అవుతుందో లేదో అని అనుకున్న సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
హీరోకు, నిర్మాతకు మధ్య ఎంతో సుదీర్ఘమైన చర్చల తర్వాత ఈ సినిమాను నిర్మాత అనుకున్న విధంగానే ఈ రోజు రిలీ చేసాడు.
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్( Hero Nikhil Siddharth ) రెండు సూపర్ హిట్స్ తర్వాత హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని ఈగర్ గా ఎదురు చూస్తున్నాడు.
"""/" /
అందుకే ఆయన నటించిన స్పై సినిమాను కొద్దిగా సమయం తీసుకుని ప్రమోషన్స్ మరికాస్త పెంచి రిలీజ్ చేయాలని అనుకున్నాడు.
కానీ నిర్మాత కారణాల వల్ల ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అవ్వక తప్పలేదు.
ప్రస్తుతం నిఖిల్, ఐశ్వర్య మీనన్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా థ్రిల్లర్ మూవీ ''స్పై''.
( Spy Movie ) యాక్షన్ థ్రిల్లర్ గా బీహెచ్ గ్యారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ముందు నుండి అంచనాలు బాగానే ఉన్నాయి.
అందులోను కార్తికేయ 2, 18 పేజెస్, వంటి వరుస హిట్స్ తర్వాత నిఖిల్ చేయబోతున్న సినిమా ఇదే కావడంతో అందులోను ఇది కూడా డిఫరెంట్ గా తెరకెక్కుతుండటం ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది.
ఈ సినిమా ఈ రోజు జూన్ 29న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్స్ కూడా పడ్డాయి.మరి ఓవర్సీస్ లో ప్రీమియర్స్ ద్వారా నిఖిల్ సాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్నట్టు టాక్.
"""/" /
ఈ సినిమా యూఎస్ లో ప్రీమియర్స్( Spy Movie US Premiers ) ద్వారానే 1 లక్ష 35 వేల డాలర్స్ కి పైగానే రాబట్టినట్టు మేకర్స్ అఫిషియల్ గా తెలిపారు.
దీంతో మంచి స్టార్ట్ తో స్పై సినిమా యూఎస్ లో గ్రాండ్ వెల్కమ్ అందుకోగా పాజిటివ్ టాక్ నే తెచ్చుకుంది.
దీంతో ఈ సినిమాతో నిఖిల్ మరో హిట్ అందుకోవడం ఖాయం.ఇడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కే రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించడమే కాకుండా కథ కూడా అందించారు.
అనిల్ రావిపూడి కెరియర్ లో సంక్రాంతికి వస్తున్నాం బిగ్గెస్ట్ హిట్ గా మారబోతుందా..?