నిఖిల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ.. ఓటిటీలో సడెన్ ఎంట్రీ ఇచ్చిన బ్లాక్ బస్టర్ థ్రిల్లర్..

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్( Nikhil Siddharth ) నటించిన పాన్ ఇండియన్ మూవీ ''స్పై''.

( Spy Movie ) ఈ సినిమా మంచి బజ్ క్రియేట్ చేసుకుని ఇటీవలే రిలీజ్ అయ్యింది.

బీ హెచ్ గ్యారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

రిలీజ్ ముందు మంచి అంచనాలను క్రియేట్ చేయడంతో ఈ సినిమా రిలీజ్ భారీ హైప్ తోనే థియేటర్స్ కు వచ్చింది.

నిఖిల్ సిద్ధార్థ్ రెండు సూపర్ హిట్స్ తర్వాత హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని చూస్తున్న తరుణంలో ఆయన నుండి వచ్చిన మూవీ 'స్పై'.

కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేక పోయింది.స్పై సినిమాను బాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేస్తే కలెక్షన్స్ బాగా వస్తాయి.

హ్యాట్రిక్ విజయం అందుకోవచ్చు అని నిఖిల్ అనుకోగా నిర్మాత ఒత్తిడి కారణంగా రిలీజ్ చేయాల్సి వచ్చింది.

"""/" / జూన్ 29న ఈ సినిమా రిలీజ్ కాగా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.

నిఖిల్, ఐశ్వర్య మీనన్( Iswarya Menon ) జంటగా నటించిన ఈ థ్రిల్లర్ మూవీ బీహెచ్ గ్యారీ దర్శకత్వంలో తెరకెక్కింది.

కానీ ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయే లెవల్లో వచ్చాయి.మరి గత నెలలో రిలీజ్ అయిన ఈ సినిమా సరైన హోల్డింగ్ తెచ్చుకోలేక పోయింది.

దీంతో వసూళ్లు మొత్తం తగ్గిపోయాయి. """/" / ఇదిలా ఉండగా ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ కు మేకర్స్ సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు.

ఈ సినిమాను సడన్ గా ఓటిటిలో స్ట్రీమింగ్ చేసి థ్రిల్ చేసారు.అమెజాన్ ప్రైమ్ వీడియో( Amazon Prime Video ) వేదికపై స్ట్రీమింగ్ అయ్యింది.

ఇక ఇడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కే రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించడమే కాకుండా కథ కూడా అందించారు.

చరణ్ శ్రీపాక సంగీతం అందించాడు.తెలుగుతో పాటు అన్ని భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

1,523 పోస్టులకు ఎల్లుండే నోటిఫికేషన్