ఓపెనింగ్స్ తో అదరగొట్టిన నిఖిల్…
TeluguStop.com
ఈ మధ్య యంగ్ హీరోలు అందరి కంటే నిఖిల్ ( Nikhil Siddhartha ) ఒక అడుగు ముందు ఉన్నాడు అనే చెప్పాలి ఎందుకంటే ఆయన ప్రతి సినిమా తో ఏదో ఒక కొత్త సబ్జెక్ట్ తో ముందుకు వస్తున్నాడు.
ఇప్పుడు కూడా స్పై ( Spy Movie ) అనే ఒక మూవీ తో నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రాన్ని చరణ్ తేజ్ ( Ram Charan ) ఉప్పాలపాటి సీఈఓ గా ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై కె రాజ శేఖర్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్ ( Iswarya Menon ) గా నటించింది.
టీజర్, ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ రావడం.అలాగే ‘కార్తికేయ 2 ‘ తర్వాత నిఖిల్ నుండి రాబోతున్న పాన్ ఇండియా సినిమా కావడంతో ‘స్పై’ పై అంచనాలు పెరిగాయి.
అయితే మొదటి షో నుండే ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.
యాక్షన్ ఎపిసోడ్స్, ట్విస్ట్స్ చాలా బాగున్నాయట.ది గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఆధారంగా తెరకెక్కిన మూవీ ఇది.
రెండో ప్రపంచ యుద్ధంలో ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి, లక్షలాది మంది సామాన్యులను సైనికులుగా తయారు చేసి వారిలో యుద్ధ స్పూర్తిని నింపారు సుభాష్ చంద్రబోస్.
"""/" /
అలాంటి గొప్ప వ్యక్తి 1945లో ప్లేన్ క్రాష్ అయ్యి చనిపోయినట్లు మనం చిన్నప్పుడు చదువుకున్నాం.
కానీ అది కవరప్ స్టోరీ అని H3 Class=subheader-style‘స్పై’ టీజ/h3pర్ లో చూపించారు.
అలాగే సుభాష్ చంద్రబోస్ గురించి మిస్ అయిన ఓ ఫైల్ కి సంబంధించిన కథ ఇదని ట్రైలర్లో చూపించారు.
గ్యారీకి దర్శకుడిగా ఇది మొదటి చిత్రమైనప్పటికీ ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా స్పై ని రూపొందించాడట.
ఈరోజు పబ్లిక్ హాలిడే కూడా ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా బాగున్నాయి.
"""/" /
నిఖిల్ కెరీర్లో ‘స్పై’ తొలిరోజు భారీ ఓపెనింగ్స్ నమోదు చేసిన మూవీగా నిలవడం ఖాయంగా కనిపిస్తుంది.
ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం 200 K డాలర్స్ కి చేరువలో ఉన్నట్టు సమాచారం.
లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ కూడా ఉంది కాబట్టి.ఈ ఆదివారానికి బయ్యర్స్ అంతా సేఫ్ జోన్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.
ఈ వీకెండ్ గడిస్తే గానీ సినిమా హిట్ రేంజ్ ని మనం అంచనా వేయలేము.
మోక్షజ్ఞ ఎంట్రీకి ఈ సంవత్సరంలో అయిన మోక్షం లభిస్తుందా..?