మీ సినిమా రిలీజ్ అవ్వదురా అన్నారు.. నిఖిల్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

హ్యాపీడేస్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన నిఖిల్ కు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.

ఆ తర్వాత నిఖిల్ నటించిన పలు సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా స్వామిరారా, కార్తికేయ సినిమాలు విజయాలను సొంతం చేసుకోవడంతో నిఖిల్ కు క్రేజ్ పెరిగింది.

త్వరలో నిఖిల్ నటించిన కార్తికేయ2 థియేటర్లలో విడుదల కానుంది.30 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.

ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన ఈ సినిమా ఆగష్టు 12వ తేదీన థియేటర్లలో విడుదల కానుండగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ నిఖిల్ ఎమోషనల్ అయ్యారు.

ఒక రకంగా తను నటించిన కార్తికేయ2 సినిమా రిలీజ్ కాదని అందరూ అనుకుంటున్న సమయంలో తాను చాలా ఏడ్చానని నిఖిల్ తెలిపారు.

కార్తికేయ2 మూవీని వెనక్కు తోసేయాలని చూశారని ఆ సమయంలో నాకు చాలా ఏడుపు వచ్చిందని నిఖిల్ చెప్పుకొచ్చారు.

ఆగష్టు 12వ తేదీన మా సినిమాను విడుదల చేస్తామని చెప్పిన సమయంలో ఆ డేట్ కూడా వద్దని చాలామంది సూచనలు చేశారని నిఖిల్ చెప్పుకొచ్చారు.

కార్తికేయ2 మూవీని అక్టోబర్, నవంబర్ లో విడుదల చేయాలని అలా చేయని పక్షంలో థియేటర్లు దొరకవని అనే పరిస్థితి వచ్చిందని ఆ సమయంలో చాలా ఏడుపు వచ్చిందని నిఖిల్ కామెంట్లు చేశారు.

హ్యాపీడేస్ మూవీ నుంచి ఎప్పుడూ ఇలాంటి అనుభవం ఎదురుకాలేదని నిఖిల్ అన్నారు. """/"/ దిల్ రాజు, ఏషియన్ సునీల్ ఈ సినిమాకు సపోర్ట్ చేస్తున్నారని నిఖిల్ చెప్పుకొచ్చారు.

ఇబ్బందులు ఉన్నప్పటికీ నిర్మాతలు మాత్రం ఎంతో బాధ్యతతో వ్యవహరించారని నిఖిల్ చెప్పుకొచ్చారు.మాచర్ల నియోజకవర్గం, కార్తికేయ2 సినిమాలు ఒకేరోజు థియేటరల్లో విడుదలవుతుండగా ఈ రెండు సినిమాలలో ఏ సినిమా పై చేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది.

పోస్టుమార్టం గదిలో రొమాన్స్ చేస్తూ కక్కుర్తి పడ్డ జంట.. వీడియో వైరల్..