కార్తికేయ 3 పట్టాలెక్కేది ఎప్పుడు.. హిందీ ప్రేక్షకులు వెయిటింగ్‌

నిఖిల్, చందు మొండేటి కాంబినేషన్ లో వచ్చిన కార్తికేయ సినిమా డీసెంట్ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఆ సినిమా వచ్చిన చాలా సంవత్సరాల తర్వాత సీక్వెల్ గా కార్తికేయ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మొదటి కార్తికేయ చిత్రానికి రెండవ కార్తికేయ కు పెద్దగా సంబంధం లేదు.కథ విషయంలో మరియు ఇతర విషయాలను సీక్వెల్ అన్నట్లుగా కాకుండా కొత్త సినిమా అన్నట్లుగానే రూపొందించడం జరిగింది.

ఇప్పుడు మూడవ పార్ట్ ఎలా ఉండబోతుందా అంటూ అంత ఆసక్తి ఏదో చూస్తున్నారు.

రెండవ పార్ట్ తెలుగులోనే కాకుండా హిందీ లో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఉత్తర భారతంలో పాతిక కోట్ల కలెక్షన్స్ నమోదు చేయడం తో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయినా కార్తికేయ 2 సినిమా యొక్క సీక్వెల్ ఈ ఏడాది లోనే ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

ఇప్పటికే దర్శకుడు చందు మొండేటి ఒక అద్భుతమైన కథ ను రెడీ చేశాడని, అతి త్వరలోనే ఆ కథ కు సంబంధించిన ఫైనల్ స్క్రిప్ట్ రెడీ అవుతుందని సమాచారం అందుతోంది.

"""/"/ ఇదే ఏడాది ద్వితీయార్థం లో సినిమా ను మొదలు పెట్టి వచ్చే ఏడాది సమ్మర్ వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నారట.

బాలీవుడ్ ప్రేక్షకుల దృష్టి ని ఆకర్షించేందుకు ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్స్ నటించిన అవకాశం ఉంది.

కాస్త ఎక్కువ బడ్జెట్ తో ఈ సినిమా ని రూపొందించబోతున్నారని తెలుస్తోంది.నిఖిల్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా కార్తికేయ 3 నిలిచే అవకాశం ఉంది.

నిఖిల్ కు జోడీగా మొదటి పార్ట్‌ లో స్వాతి నటించగా రెండవ పార్ట్‌ లో అనుపమ పరమేశ్వరన్‌ నటించిన విషయం తెల్సిందే.

మరి మూడవ పార్ట్‌ లో ఏ హీరోయిన్ నటించేనో చూడాలి.

భారత్ బెస్ట్ అయితే అక్కని అమెరికాకు ఎందుకు.. కుర్రాడి క్వశ్చన్‌తో MTV యాడ్ సెన్సేషన్!