కార్తికేయ 2 నిజంగా వంద కోట్ల వసూళ్లను రాబట్టలేదా?

యంగ్ హీరో నిఖిల్ కార్తికేయ 2 సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

చందు మొండేటి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా లో మలయాళం ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది.

ఈ సినిమా కు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ లో భారీ ఎత్తున వసూళ్లు నమోదు అవుతున్నాయి.

అక్కడ పాతిక కోట్ల వరకు వసూళ్లు సాధ్యం అవుతాయని ప్రేక్షకులు భావిస్తున్నారు.ఇప్పటికే అక్కడ ఇరవై ఒక్క కోట్ల రూపాయల వసూలు నమోదు అయ్యాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెప్తున్నారు.

ఇక కార్తికేయ 2 సినిమా ఇప్పటికే రూ.100 కోట్ల వసూళ్లు నమోదు చేసింది అంటూ హైదరాబాదు లో చిత్ర యూనిట్ సభ్యులు టాలీవుడ్ ప్రముఖులను ఆహ్వానించి మరీ భారీ ఎత్తున ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఆ కార్యక్రమం సూపర్ హిట్ అయింది.అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు కార్తికేయ సినిమా రూ.

100 కోట్ల వసూలను నమోదు చేయలేదని తెలుస్తోంది.రూ.

90 కోట్ల ను దాటిన ఆ సినిమా మరో మూడు నాలుగు రోజుల్లో రూ.

100 కోట్లను చేరువయ్యే అవకాశం ఉంది.అయితే యూనిట్‌ సభ్యులు ముందుగానే రూ.

100 కోట్ల వసూళ్ల వేడుకని నిర్వహించుకున్నారు.సినిమా ఎలాగూ 100 కోట్లు వసూలు చేస్తుంది కనుక అందులో ఎలాంటి తప్పు లేదు అనేది కొందరు అభిప్రాయం.

అయితే సినిమా రూ.100 కోట్లు పూర్తి చేసిన తర్వాత ఈవెంట్ నిర్వహిస్తే ఇంకా బాగుండేది అనేది కొందరి అభిప్రాయం.

ఏది ఏమైనా కార్తికేయ 2 సినిమా ఒక రేంజిలో సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉంది.

ఇటీవల విడుదలైన విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా కంటే కూడా అధికంగా ఇప్పటికీ వసూలను కార్తికేయ 2 దక్కించుకుంటున్నాడు అంటే ఏ స్థాయి విజయాన్ని ఈ సినిమా దక్కించుకుందో అర్థం చేసుకోవచ్చు.

ఉత్తర భారతం లో ఈ సినిమా భారీ ఎత్తున వసూలను నమోదు చేస్తూనే ఉంది.

మరో వారం రెండు వారాల పాటు అక్కడ ఇక్కడ వసూళ్ల జాతర కొనసాగే అవకాశం ఉంది.

తద్వారా రూ.110 కోట్ల వసూళ్లు ఈ సినిమా కు సాధ్యమవుతాయని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వారానికి 2 సార్లు ఉడికించిన శనగలు తింటే ఎన్ని ఆరోగ్య లాభాలు పొందొచ్చో తెలుసా?