Niharika Konidela : నాకు పిల్లలని కనాలని ఉంది… నిహారిక సెన్సేషనల్ కామెంట్స్!
TeluguStop.com
మెగా డాటర్ నిహారిక ( Niharika Konidela ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటించడమే కాకుండా వెబ్ సిరీస్ లను సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
యాంకర్ గా తన కెరియర్ ప్రారంభించినటువంటి నిహారిక అనంతరం ఒక మనసు సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
అయితే ఈమె నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.ఇలా మూడు సినిమాలలో నిహారిక నటించినప్పటికీ తన సినిమాలు పెద్దగా సక్సెస్ కావడంతో పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయారు.
"""/"/
ఈ విధంగా ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి జొన్నలగడ్డ వెంకట చైతన్య( Jonnalagadda Venkata Chaitanya ) అనే వ్యక్తిని ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నటువంటి నిహారిక ఎక్కువ కాలం పాటు తనతో కలిసి వైవాహిక జీవితంలో ఇమడలేకపోయింది.
ఇలా పెళ్లయినటువంటి రెండు సంవత్సరాలకి వీరిద్దరు విడాకులు ( Divorce ) తీసుకొని విడిపోయారు.
ఇలా విడాకులు తర్వాత నిహారిక తిరిగి కెరియర్ పైన ఫోకస్ పెట్టి ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
"""/"/
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నిహారిక పిల్లల గురించి మాట్లాడితే చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయి.
ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ తనకు పిల్లలు అంటే చాలా ఇష్టం అని తెలిపారు.
అందుకే నాకు పిల్లలని కనాలని ఉంది అంటూ ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక రెండో పెళ్లి( Second Marriage ) గురించి కూడా ఈమె స్పందించారు.
ఇలా పిల్లలను కనాలని ఉంది అంటూ తన మనసులో మాటను బయట పెట్టడంతో రెండో పెళ్లికి కూడా తాను సిద్ధమే అంటూ ఈ సందర్భంగా చెప్పకనే చెప్పేశారు.
ఇలా పిల్లలు కావాలని ఉంది అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్( Viral Comments ) గా మారడంతో నేటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ గురించి విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆయన ఏమన్నారంటే?