Niharika : రాజకీయంగా తన సపోర్ట్ వారికే.. ఓపెన్ అయిన నిహారిక?
TeluguStop.com
మెగా డాటర్ నిహారిక( Niharika ) ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగాను అదే విధంగా నటిగాను కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు ఇకపోతే తాజాగా ఈమె సాగు ( Saagu Movie ) అనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నిహారికకు రాజకీయాల( Politics ) గురించి కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు( AP Elections ) జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున రాజకీయ వేడి రాజుకుంది.ఈ సందర్భంగా యాంకర్ నిహారికను ప్రశ్నిస్తూ రాజకీయాలలో మీ సపోర్ట్ ఎవరికి మీ ఓటు ఎక్కడుంది అంటూ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు నిహారిక సమాధానం చెబుతూ నా సపోర్ట్ ఎప్పుడూ జనసేనకే( Janasena ) ఉంటుందని తెలిపారు.
నేను 2019 ఎన్నికలలో కూడా ప్రచారం చేశానని ఈసారి ఎన్నికలలో కూడా ప్రచారం చేస్తానని తెలిపారు.
"""/" /
ఇక నా ఓటు ఆంధ్రాలోనే ఉంది అంటూ ఈ సందర్భంగా నిహారిక చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
నిహారిక తన బాబాయ్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) జనసేన పార్టీకే తన మద్దతు అని తెలియజేశారు.
ఇక జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈసారి ఎన్నికలలో మెగా ఫ్యామిలీ కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహించబోతున్నారని తెలుస్తోంది.
"""/" /
నిహారిక తన బాబాయ్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకే తన మద్దతు అని తెలియజేశారు.
ఇక జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈసారి ఎన్నికలలో మెగా ఫ్యామిలీ కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహించబోతున్నారని తెలుస్తుంది.
ఇప్పటికే పలువురు మెగా హీరోలు కూడా మా సపోర్ట్ ఎప్పుడూ బాబాయ్ కి ఉంటుందని వెల్లడించిన సంగతి తెలిసిందే.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి23, గురువారం 2025