ఆ కేసు తర్వాత మళ్లీ వార్తల్లో నిలిచిన నిహారిక.. లుక్ పూర్తిగా మార్చేయడంతో?

కొన్ని రోజుల క్రితం తన తప్పేం లేకపోయినా పబ్ లో ఉండటం వల్ల నిహారిక వార్తల్లో నిలిచారనే సంగతి తెలిసిందే.

నెటిజన్లు సోషల్ మీడియాలో నిహారికను తీవ్రస్థాయిలో ట్రోల్ చేశారు.నిహారిక సైతం మీడియా అడిగిన ప్రశ్నల గురించి స్పందించడానికి అస్సలు ఇష్టపడలేదు.

మెగా ఫ్యాన్స్ మాత్రం నిహారికను కావాలని కొంతమంది టార్గెట్ చేసి ట్రోల్ చేశారని కామెంట్లు చేశారు.

150 మంది పబ్ లో ఉంటే కేవలం నిహారిక గురించి మాత్రమే మీడియా ప్రస్తావించిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అయితే నిహారిక తాజాగా జిమ్ లో ఫోటోలు దిగగా ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

వైరల్ అవుతున్న ఫోటోలో నిహారిక షార్ట్ హెయిర్ తో కొత్త లుక్ లో కనిపిస్తున్నారు.

కొన్నిరోజుల క్రితం నిహారిక తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను డిలీట్ చేశారనే సంగతి తెలిసిందే.

ప్రస్తుతం వైరల్ అవుతున్న కొత్త లుక్ లో నిహారిక మరింత అందంగా కనిపిస్తుండటం గమనార్హం.

నిహారిక నవ్వుతూ ఫోటోలలో కనిపించడంతో మెగా ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.నిహారిక యాంకర్ గా పలు షోలు చేయడంతో పాటు పలు వెబ్ సిరీస్ లలో నటించారు.

"""/"/ సినిమాలలో హీరోయిన్ గా నిహారిక సక్సెస్ కావాలని ఎంతో ప్రయత్నించినా సక్సెస్ కాలేకపోయారు.

ఆమె హీరోయిన్ గా నటించిన ఒక మనసు, సూర్యకాంతం సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.

నిహారిక ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నారు.నిహారిక మళ్లీ కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

నిహారిక నిర్మాతగా తెరకెక్కిన వెబ్ సిరీస్ లు సైతం సక్సెస్ సాధించాయి.నిహారిక కెరీర్ పరంగా ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాల్సి ఉంది.

విశ్వం భర సినిమా కోసం భారీ సాహసం చేస్తున్న చిరంజీవి…